wallpaper
celebrity

అజ్ఞ్యాతవాసి
Views : 15511

3.00
|
|
Write a Review
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.25
Verdict - అజ్ఞాతవాసి

no review available


Reviewed By : Vijay MOVIE JOCKEY
2.75
Verdict - అజ్ఞాతవాసి సినిమా పై పూర్తి సమీక్ష....

నటీనటులు : పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమాన్యుయెల్


దర్శకత్వం : త్రివిక్రమ్


నిర్మాత : ఎస్.రాధాకృష్ణ


సంగీతం : అనిరుద్


సినిమాటోగ్రఫర్ : వి.మణికందన్


పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమాన్యుయెల్ హీరోయిన్లుగా నటించారు, డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఎన్నో భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైంది, మరి ఆ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.


పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన చిత్రాలు 'జల్సా', 'అత్తారింటికి దారేది' ఆ సినిమాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయి అన్నది వేరే చెప్పనక్కర్లేదు. మరి ఇప్పుడు 'అజ్ఞాతవాసి' వారి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ చిత్రం ఆ రెండు సినిమాలకి మించి ఉంటుందని అభిమానులు అంచనా వేయడంలో తప్పులేదు కానీ ఎక్కువ ఆశించి సినిమాకి వెళ్తే నిరుత్సాహమే! 


కథ: 


ఒక శ్రీమంతుడు విందా (బొమన్ ఇరానీ) కథ ఇది. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి బాగా డబ్బులు సంపాదించి ఎ.బి అనే సంస్థ కు అధినేతగా ఉంటూ కోట్లు సంపాదిస్తాడు విందా, ఆస్తి కోసం తనని తన కొడుకుని అదే సంస్థలో ఉన్న వారు చంపించేస్తారు అయితే తన భార్య (ఖుష్బు) తన భర్తను, కొడుకును ఎవరు చంపారో తెలుసుకుని... ఆ చంపినవారిని చంపడం కోసం.. ఆస్తిని వేరే వాళ్ళ చేతులకి వెళ్లకుండా కాపాడటం కోసం...అప్పటి వరకూ ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో ఉన్న హీరోని (పవన్ కళ్యాణ్) రంగంలోకి దింపుతుంది ఖుష్బు.  అక్కడి నుంచి మిగతా కథ మొదలవుతుంది....అసలు పవన్ కళ్యాణ్ కి ఖుష్బు కి ఉన్న సంబంధం ఏంటి..? బొమన్ ఇరానీ ని చంపినవారు ఎవరు? ఎందుకు చంపారు? ఇంతకీ ఎవరు వాళ్లు?  వాళ్ల గురించి పవన్ కళ్యాణ్ ఎలా తెలుసుకుంటాడు...? ఇదే సినిమా కథ.


•ప్లస్ పాయింట్స్•


*పవన్ కళ్యాణ్ నటన బాగుంది... అభిమానులకు బాగా నచ్చుతుంది.


* ప్రీ క్లైమాక్స్ ఇంటర్వెల్ సన్నివేశాలు బాగున్నాయి.


*ప్రొడక్షన్ వ్యాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.


*వి.మణికందన్ సినిమాటోగ్రఫీ, అనిరుద్ మ్యూజిక్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. 


*త్రివిక్రమ్ దర్శక ప్రతిభ కనిపించింది


*కీర్తి సురేష్ అను ఇమాన్యుయెల్ పరవాలేదనిపించారు. 


*ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆది, ఖుష్బూ నటనల గురించి... ఇద్దరూ చాలా బాగా చేశారు.


*రావు రమేష్, మురళీ శర్మ వీరిద్దరి కామెడి చాలా బాగా పండింది.


*గాలి వాళ్లుగా, బయటకొచ్చి చూస్తే, కొడకా  కోటీశ్వర్రావా అనే ఈ మూడు పాటలు తెరపై చూడడానికి బాగున్నాయి.


•మైనస్ పాయింట్స్•


*అభిమానులకు నచ్చే అంశాలు లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్.


*త్రివిక్రమ్ మార్క్ మాటలు ఈ సినిమాలో కనిపించలేదు.


*సింగిల్ లైన్ డైలాగ్స్ కానీ గుర్తుండిపోయే మాటలు గానీ పెద్దగా లేవనే చెప్పాలి.


*ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులని నిరాశకు గురి చేస్తాయి.


*సెకండాఫ్ మొదట్లో పరవాలేదనిపించినా చివరికొచ్చేసరికి ఊహించనంత ఉండదు.


*ఈ సినిమాలో పాటలు మధ్యమధ్యలో కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వచ్చేస్తూంటాయి, దీనివలన ప్రేక్షకుడికి  సినిమాపై వున్న దృష్టి మళ్ళుతుంది.


*చాలా సన్నివేశాలు హాలీవుడ్ లార్గో వించ్ సినిమాను తలపిస్తాయి.


'విచ్చలవిడిగా చింపితే మారణహోమం అదే విలక్షణతో చంపితే ధర్మం' ఇలాంటి కొన్ని డైలాగ్స్ తో సినిమా పర్వాలేదనిపించినా అభిమానులకి నచ్చుతుంది అని చెప్పడం కంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరవుతుంది అని చెప్పొచ్చు. మొత్తంగా చెప్పాలంటే సినిమా సంక్రాంతికి వచ్చిన ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఏటువంటి అంచనాలు లేకుండా వెళితే సినిమా అందరికీ నచ్చే అవకాశం ఉంది.


Reviewed By: Swetha Anonymous
2.50
Agnyaathavaasi review
Excellent Reviews and Ratings. I really enjoyed your reviews & I hope you may also like these reviews http://bit.ly/Agnyaathavaasi-Review

 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
అజ్ఞ్యాతవాసి మూవీ వర్కింగ్ ఫొటోస్
అజ్ఞ్యాతవాసి స్టిల్స్
అజ్ఞ్యాతవాసి పోస్టర్స్
Videos
Load moreవీడియోస్!!!
Latest News