wallpaper
celebrity

బాలకృష్ణుడు
Views : 10870

3.00
|
|
Write a Review
విడుదల తేది : November 24, 2017, టేక్నిషియన్ : మణి శర్మ, తారాగణం :నారా రోహిత్, రెజినా కాసాండ్రా, రమ్యకృష్ణ
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.00
Verdict - బాలకృష్ణుడు
no review available

Reviewed By : Vijay MOVIE JOCKEY
2.50
Verdict - Bala Krishnudu Review...
'బాలకృష్ణుడు' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో యువ కథానాయకుడిగా ఎదుగుతున్న 'నారా రోహిత్' కెరియర్ మొదటి నుంచి కూడా విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు, కానీ ఇప్పుడు వరకు అతనికి సరైన హిట్టు తగలలేదు, ఇప్పటివరకు చేసిన విభిన్న చిత్రాలకి విరుద్ధంగా ఈసారి పాత ఫార్ములానే నమ్ముకున్నాడు.

అసలు కథలోకి వెళితే రవీందర్ రెడ్డి అనే ఒక ఫ్యాక్షనిస్టు రాయలసీమలో ఒక మంచి మనిషిగా, నాయకుడుగా ఎదుగుతూ మంచి పనులు చేస్తుంటాడు. అయితే అదే ఏరియా లో రవికి వ్యతిరేకంగా ప్రతాప్ రెడ్డి (అజయ్) అనే మరో ఫ్యాక్షనిస్టు ఉంటాడు, వీరిద్దరి గొడవల్లో రవీందర్ రెడ్డిని ప్రతాప్ రెడ్డి చంపేస్తాడు. తర్వాత చంపిన నేరానికి ప్రతాప్ రెడ్డి జైలులో ఉంటాడు. ఈ కథ అనంతపురం జిల్లాలోని పరిటాల రవి వాస్తవ కథకు దగ్గరగా ఉండటం గమనార్థకం. వాస్తవికతను పక్కన పెడితే,  చాలాకాలం తర్వాత ప్రతాప్ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చాక రవి కూతుర్ని చంపడానికి ప్రయత్నిస్తాడు, అయితే హీరోయిన్(రెజీనా) కి తెలీకుండా హీరో(నారా రోహిత్)ని తన బాడీగార్డ్ గా రవీందర్ రెడ్డి చెల్లెలు (రమ్యకృష్ణ) పెడుతుంది, చివరకి ప్రతాప్ రెడ్డి ఏమయ్యాడు,  హీరోకి ఈ కథ కి అసలు సంబంధం ఏమిటి అనేది మిగతా కథ

ఈ సినిమా చూస్తున్నంత సేపు, మనకు తెలిసిన పాత చింతకాయ పచ్చడి లాగానే ఉంటుంది అయితే దానికి కూసింత స్క్రీన్ ప్లే రంగులు అద్దటంలో కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, ఫస్టాఫ్ లో సినిమా కథ ముందుగానే తెలిసిపోవడంతో ఆసక్తి పోతుంది.  అయితే పృథ్వీ రాజ్ ఇంటర్వెల్ ముందు ఎంటర్ అవ్వడంతో  కొంచెం కామెడీ పండిస్తాడు. సినిమాకి పృథ్వీ సెకండ్ హీరో అని చెప్పుకోవచ్చు, పృథ్వీరాజ్ ఎపిసోడ్స్  మినహాయించి సినిమాలో చెప్పుకోదగ్గ కామెడీ సీన్స్ ఏమీ లేవు, అయితే సెకండాఫ్ లో మాత్రం కొద్దిగా కొత్త తరహాలో సినిమా నడుస్తుంది అన్న భావం కలుగుతుంది, కాని చివరికి క్లైమాక్స్లో మళ్లీ పాత ఫార్ములానే అప్లై చేస్తూ సినిమాను ముగించేశాడు దర్శకుడు.

సినిమాలో ప్లస్ పాయింట్స్ హీరో, హీరోయిన్ ల నటన ఇతర నటీనటుల యాక్టింగ్ బాగుందని చెప్పుకోవాలి, ముఖ్యంగా పృథ్వీరాజ్ కామెడీ బాగా పండింది. సినిమాలో మైనస్ పాయింట్స్ కథ, అనిటికీ మించి పాత సినిమాల స్క్రిప్ట్, డైలాగ్స్ లా అనిపిస్తాయి.

సినిమాలో స్క్రీన్ ప్లే తో ఎక్కడా బోర్ కొట్టకుండా చేసినా, బి, సీ సెంటర్ ప్రేక్షకుల ఆదరణ బట్టే సినిమా భవితవ్యం తేలనుంది. చివరిగా, నారా రోహిత్ ఈసారి కూడా నిరుత్సాహ పెట్టినట్టే అని పిస్తుంది.   

Be the first to comment on Balakrishnudu Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
బాలకృష్ణుడు మూవీ స్టిల్స్
బాలకృష్ణుడు వర్కింగ్ స్టిల్స్
బాలకృష్ణుడు పోస్టర్స్
Videos
Load moreవీడియోస్!!!
Latest News