wallpaper
celebrity

ఛలో
Views : 10643

3.30
|
|
Write a Review
విడుదల తేది : February 02, 2018, దర్శకుడు : వెంకీ కుడుముల, నిర్మాత : ఉషా ముల్పురి, టేక్నిషియన్ : కోటగిరి వెంకటేశ్వర రావు, సాగర్ మహతి, తారాగణం :నాగ సౌర్య , రష్మిక
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.25
Verdict - చలో

Reviewed By : Vijay MOVIE JOCKEY
3.25
Verdict - ఛలో సినిమా పై పూర్తి సమీక్ష : యువతకు నచ్చే సినిమా!

నటీనటులు : నాగ శౌర్య, రష్మిక, వైవా హర్ష, సత్య, వెన్నెల కిషోర్, నరేష్.


దర్శకత్వం : వెంకీ కుడుముల.


నిర్మాత : ఉషా ముల్పూరి.


సంగీతం : సాగర్ మహాటి.


ఆర్ట్ డైరక్షన్ : రామ్ అరవసాలి.


నాగ శౌర్య హీరోగా కెనడా 'కిరిక్ పార్టీ' సినిమా హీరోయిన్ రష్మిక జంటగా నటించిన సినిమా 'ఛలో'. ఈ సినిమాకి వెంకీ కుడుముల మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించాడు. మణిశర్మ కుమారుడు సాగర్ మహాటి ఈ సినిమాకు సంగీతం అందించాడు. నాగశౌర్య కుటుంబ సభ్యులే ఈ సినిమాకి నిర్మాత బాధ్యతలు తీసుకున్నారు. ఈ చిత్రం ఈరోజు ధియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు అలరించిందో ఒక్కసారి చూద్దాం.


 కథ :


చిన్నప్పటినుంచే గొడవలు అంటే అమితమైన ప్రేమను పెంచుకుంటాడు హరి(నాగ శౌర్య), ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే ఆ గొడవల మధ్యలోకి వెళ్లడం, ఇద్దరు కొట్టుకుంటే చూసి ఆనంద పడుతూ ఉంటాడు. కొడుకు చేసే పనుల వల్ల తండ్రికి సమస్యలు ఎదురవడంతో కొడుకుని దారికి తీసుకురావాలని, హరీని చదువు కోసమని చెప్పి తిరుపురం అనే ఊరికి పంపించేస్తారు. తిరుపురం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య సరిహద్దు లో ఉన్న ప్రాంతం, ఇక్కడ ఇరు రాష్ట్ర ప్రజల మధ్య వైరం తరతరాలుగా వస్తుంది. 


హీరో హరి మొదటి చూపులోనే తమిళ ప్రాంతానికి చెందిన కార్తికా ( రష్మిక) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. తను తిరిగి ప్రేమించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాడు, చివరికి తను ప్రేమిస్తుంది. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఈ రెండు ఊర్లు కలవాలని హీరోకి అర్దమవుతుంది. మరి హీరో రెండు ఊర్లని ఎలా కలుపుతాడు..?తన ప్రియురాలిని ఎలా దక్కించుకున్నాడు అనేది మిగతా కథ.


విశ్లేషణ :


దర్శకుడు వెంకీ గురువుకు తగ్గ శిష్యుడు అని నిరూపించుకున్నాడు. త్రివిక్రమ్ సినిమాలో మాదిరి ఈ సినిమాలో కూడా సింగిల్ లైన్ పంచ్ లు ఎక్కువగా కనిపిస్తాయి. దర్శకుడు వెంకీ సినిమాని చాలా చక్కగా తీసుకువెళ్లాడు. పాత కథే అయినప్పటికీ కొత్తగా తెరకెక్కించాడు. సినిమా మొత్తాన్ని కామెడీ సీన్స్ తో నడిపించేశాడు దర్శకుడు, దీనివలన అసలు కథ పక్కకి వెళ్లిపోయింది. హీరో నాగ శౌర్య హీరోయిన్ రష్మిక  వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. నాగ సూర్య నటన యువతను బాగా ఆకర్షిస్తుంది. హీరోయిన్ రష్మికాకి ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా తరువాత నుంచి మంచి అవకాశాలు వస్తాయి. ఈ సినిమా తర్వాత తనకంటూ అభిమానులు కూడా సంపాదించుకుంటుంది, ఆ స్థాయిలో ఈ సినిమాలోని తన పాత్రను చూపించారు.


వైవా హర్ష, సత్య, వెన్నెల కిషోర్, నరేష్, తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు. నరేష్ హీరో తండ్రి పాత్రలో ఒదిగిపోయాడని చెప్పాలి. సత్య స్నేహితుడు పాత్రలో బాగానే నటించాడు. ముఖ్యంగా కథ చివర్లో వచ్చే వెన్నెల కిషోర్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాని చాలా అందంగా తెరకెక్కించారు. ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా తీశారు. సినిమాల్లో చాలా సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకుంటాయి. మొదటి భాగం లో వచ్చే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు, రెండో భాగంలో వచ్చే చివరి పాట అందులో నాగ శౌర్య చేసిన నటన చాలా బాగుంది. ఈ సినిమాలో నాగ శౌర్య ఒక మెట్టు ఎక్కేసాడు అని చెప్పాలి. మణిశర్మ కుమారుడు సాగర్ మహాటి అందించిన పాటలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.


బలం బలహీనతలు


ప్లస్ పాయింట్స్ : 


* నాగ శౌర్య, రష్మిక నటన


* ఫస్టాఫ్లో కామెడీ సన్నివేశాలు, రెండో భాగంలో అక్కడక్కడ వచ్చే సింగిల్ లైన్ పంచులు.


* ఫస్టాఫ్ బావుంది


* హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు.


* సినిమాకి పాటలు మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణలు.


* దర్శకుడి నడిపించే తీరు.


మైనస్ పాయింట్ :


* సినిమా మొత్తాన్ని కామెడీతో నడిపించేస్తూ అసలు కథను పక్కన పెట్టేస్తారు.


* పతాక సన్నివేశం ఆశించిన స్థాయిలో లేకపోవడం.


* ఎమోషనల్ సన్నివేశాలకు కామెడీ సన్నివేశాలు జోడించడం.


* మొదటిభాగం లో ఎంతో ఉత్కంఠతో సాగే సినిమా రెండో భాగానికి వచ్చేసరికి డీలా పడి పోతుంది.


* పాత కథ.


మొత్తానికి ఈ సినిమా అటు యువతను ఇటు కుటుంబ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ సంవత్సరంలో వచ్చిన అన్ని సినిమాలు‌ కంటే ఈ సినిమా చాలా బాగుందని చెప్పచ్చు. హాస్యాన్ని ఎక్కువగా ఆస్వాదించే వారికి ఈ సినిమా ఒక విందు భోజనం లాంటిది. ప్రేమికులకి, యువత కి నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. మొత్తానికి నాగశౌర్య హిట్ కొట్టాడు!


Be the first to comment on Chalo Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
ఛలో స్టిల్స్
చలో ప్రీ లుక్ డిజైన్ ఫోస్టర్
Videos
Load moreవీడియోస్!!!
Latest News