విడుదల తేది : January 12, 2018, తారాగణం :emp
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.25
Verdict - గ్యాంగ్
no review available

Reviewed By : Vijay MOVIE JOCKEY
2.75
Verdict - సూర్య గ్యాంగ్ మూవీ రివ్యూ....

నటీనటులు : సూర్య, కీర్తి సురేష్, రమ్య కృష్ణ ఆర్.జే బాలాజీ, శివ శంకర్ మాస్టర్, సుధాకర్ తదితరులు


దర్శకత్వం : విగ్నేష్ శివన్


నిర్మాత : జ్ఞాల్ వేల్ రాజా


సంగీతం : అనిరుద్


సినిమాటోగ్రఫర్ : దినేష్ కృష్ణన్


ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్


తమిళనాడులో పెద్ద స్టార్ హీరోగా ఉన్న సూర్య తెలుగునాట కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. 'యముడు' సినిమా తర్వాత నుంచి తెలుగులో తన మార్కెట్ మరింత పెరిగింది. ఇప్పుడు కీర్తి సురేష్ తో జంటగా నటించిన 'గ్యాంగ్' సినిమాను తెలుగులో డబ్ చేసారు. విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.'గ్యాంగ్' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం..


•కథ•


1987 కాలంనాటి చిత్రమిది, దేశాన్ని నిరుద్యోగం పట్టిపీడిస్తున్న రోజులవి, ఉద్యోగాల్లేక యువత నిరుత్సాహంలో వుంటుంది, ఉద్యోగం దొరకాలంటే లంచం ఇవ్వాలి, లంచం ఇవ్వ లేనివారికి ఉద్యోగం రాదు. ఈ పరిస్థితి ఒక తెలివైన కుర్రాడిని (సూర్య) ఎంతో బాధకు గురిచేస్తుంది, ఈ పరిస్థితుల వల్ల తన స్నేహితుడు కు జరిగిన నష్టాన్ని మరెవరికీ జరగకూడదనే ఉద్దేశ్యంతో అతనే తనకు తానుగా ఉద్యోగం సృష్టించుకునే ఒక గ్యాంగ్ ను తయారుచేసుకొని మరో కొంత మందికి ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెడతాడు. ఇలా చేయడం చట్ట విరుద్ధం కనుక ఆ గ్యాంగ్ ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటారు‌. మరి ఈ తెలివైన కుర్రాడు వాటి నుంచి ఎలా తప్పించుకుంటాడు అన్నదే మిగతా కథ.


•విశ్లేషణ•


హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా 2013 లో 'స్పెషల్ 26' అనే సినిమా వచ్చింది. 'గ్యాంగ్' సినిమా ఆ సినిమాకి రీమేక్ గా చెప్పుకోవాలి. 'స్పెషల్ 26' సినిమా నుంచి కథను, మరికొన్ని సన్నివేశాలను తీసుకున్నారు ఆపై సినిమాలో చాలా మార్పులు చేశారు ముఖ్యంగా తమిళ నేటివిటీకి తగ్గట్టుగా సినిమాలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దర్శకుడు ప్రతిభ అద్భుతం అని చెప్పుకోవాలి, ఆరెంజ్లో ఒక హిందీ సినిమాకి తమిళ నేటివిటీని జతచేశాడు అది ఎంత బలంగా ఉందంటే సూర్యను మనం ఎంతో కాలం నుంచి చూస్తున్నా కానీ ఒక పరాయి సినిమాను చూసిన అనుభవమే కలుగుతుంది. తమిళ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు కాని తెలుగు ఆడియన్స్ కు మాత్రం సినిమా చూస్తున్నంతసేపు ఒక తమిళ సినిమాని చూస్తున్నామనే అనుభూతి కలగకమానదు. పాటలు తెరపై చూసేటప్పుడు తెలుగులో వచ్చే పాటకు వెనకాల వేసే స్టెప్పులకు సంబంధం ఉండదు.


 


సినిమాటోగ్రఫర్ దినేష్ కృష్ణన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ పనితీరు బాగుంది, వాళ్ళ కష్టం తెర పై కనిపించింది, వాళ్ల పూర్తిస్థాయి ప్రతిభను తీసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో సూర్య ని కొత్తగా చూపించారు, సూర్యా చాలా యంగ్ గా కనిపిస్తాడు. మామూలు కథలకే సూర్యా తన మార్క్ యాక్టింగ్ జోడించి సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్తాడు అలాంటిది తనకు ఒక మంచి కథ తోడైతే ఇంకేముంది తన నటనతో ప్రేక్షకుల్ని మైమరిపిస్తాడు. అనిరుధ్ పాటల్లో కూడా దర్శకుడు కనిపించాడు, 'చిటిక మీద చిటిక వేశార' ఈ ఒక్క పాట మినహాయించి మిగిలిన పాటలన్నీ తెలుగు ప్రేక్షకుల్ని నిరాశ పరుస్తాయి కానీ పాటలన్నింటినీ చాలా అందంగా తెరపై చూపించారు. నటీనటుల విషయానికొస్తే కీర్తి సురేష్ ఒక అందమైన తమిళ కుట్టీలా కనిపించింది, రమ్య కృష్ణ పైకి గంభీరంగా లోపల భయపడుతూ తన పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు వారి స్థాయిలో వారు అలరించారు దర్శకుడు అందరి నటీనటుల నుంచి సినిమాకు కావలసినంత తీసుకున్నాడని చెప్పాలి.


బలం, బలహీనతలు


•ప్లస్ పాయింట్స్•


* దర్శకుడు ప్రతిభను కనబరిచాడు.


* వ్యవస్థపై హీరో చేసే యుద్ధం బాగుంది.


* సీబీఐ ఆఫీసర్ గా ఒక సామాన్య పౌరుడిగా రెండు విభిన్న పాత్రల్లో సూర్య బాగా నటించాడు.


* జ్ఞాల్ వేల్ రాజా నిర్మాత విలువలు బాగున్నాయి, సినిమా ఖర్చు తెరపై కనిపించింది.


* అనిరుద్ మ్యూజిక్ సినిమాకి అదనపు ఆకర్షణగా మారింది


* దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకి మెయిన్ ఫ్లస్ పాయింట్స్.


* కీర్తి సురేష్ అందం, రమ్య కృష్ణ నటన, ఆర్.జే బాలాజీ కామెడీ టైమింగ్ తో అలరించారు. శివ శంకర్ మాస్టర్, సుధాకర్ తదితరులు తమ స్థాయిలో కష్టపడ్డారు. 


•మైనస్ పాయింట్స్•


* సినిమా తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండటం.


* తెలుగులో తెరపై కనిపించే పాటలు, కొంతమంది నటీనటుల డబ్బింగ్ సరిగ్గా లేదు.


* మొదటి భాగంలో సినిమాని ఎంటర్టైనర్ గా తీసే క్రమంలో అసలైన కథనంలో సీరియస్ నెస్ పోయింది.


* సెకండాఫ్ కొంత నిదానంగా ఉంటుంది.


•తుది తీర్పు•


'స్పెషల్ 26' అనే మూవీని తీసుకుని దానికి చిరంజీవి నటించిన 'ఠాగూర్' కథను జోడించి ఈ 'గ్యాంగ్' సినిమాను తీశారు. 'స్పెషల్ 26' మూవి లో ఎక్కువగా ఇంటిలిజెంట్ గేమ్ ప్లే నడుస్తుంది దీనితో హీరోయిజం అంతగా కనబడదు. మాస్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోవడం కోసం ఠాగూర్ కథను కూడా మిక్స్ చేసారు. ఇకపోతే ఈ సినిమా తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నంతగా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకోలేదు. సూర్య నటన కోసం, విగ్నేష్ శివన్ దర్శక ప్రతిభ కోసం ఒకసారి చూడొచ్చు. 


Be the first to comment on Gang Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Videos
Load moreవీడియోస్!!!
Latest News