wallpaper
celebrity

గాయిత్రి
Views : 9200

3.00
|
|
Write a Review
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.00
Verdict - గాయత్రీ
no review available

Reviewed By : Vijay MOVIE JOCKEY
3.00
Verdict - తండ్రీ కూతుర్ల భావోద్వేగం

నటీనటులు : మంచు మోహన్ బాబు, విష్ణు, శ్రియ, నిఖిల విమల్


దర్శకత్వం : మదన్ రామిగాని


నిర్మాత : మంచు మోహన్ బాబు


సంగీతం : ఎస్. థమన్


సినిమాటోగ్రఫర్ : సర్వేశ్ మురారి


ఎడిటర్ : ఎం.ఆర్. వర్మ


స్టోరీ, స్క్రీన్ ప్లే : డైమండ్ బాబు, మంచు మోహన్ బాబు


కలెక్షన్ కింగ్, విశ్వ నట సార్వభౌమ మంచు మోహన్ బాబు ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా ‘గాయత్రి’. మదన్ రామిగాని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించాడు, ఈ సినిమాని స్వయంగా మంచు మోహన్ బాబు నిర్మించారు. సర్వేశ్ మురారి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం..


కథ :


దాసరి శివాజీ(మోహన్ బాబు) స్టేజ్ ఆర్టిస్ట్, మారువేషాల్లో ప్రముఖ వ్యక్తుల స్థానాల్లో ఇతను జైలు కి వెళ్తుంటాడు, ఆ వచ్చిన డబ్బులతో ఆశ్రమంలో పిల్లలను చేరదీసి పెంచుతూ ఉంటాడు. తను ఎంతగానో ప్రేమించిన భార్యను కోల్పోయి, తన కూతురు కోసం ఎన్నో యేళ్లుగా వెతుకుతూ ఉంటాడు. అనుకోని విధంగా తనకి తన కూతురు కనిపిస్తుంది, కానీ తన కూతురికి తన తండ్రి పై విపరీతమైన కోపం ఏర్పడుతుంది, తనని చిన్నప్పుడే కావాలని అనాధను చేసి వెళ్లిపోయాడని నమ్ముతుంది. కానీ తన తండ్రి గురించి నిజనిజాలు తెలిసుకొన్న తరవాత తన తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి తిరిగి వస్తుంది. అయితే తండ్రీ కూతుళ్లు ఒకటి అవుతున్న సమయంలో ఒక హఠాత్పరిణామం ఎదురవుతుంది ఆ పరిణామం పేరే గాయత్రీ పటేల్.


గాయత్రీ పటేల్ తనుకు అడ్డొచ్చిన వారిని చంపుకుంటూ ఎన్నో చెడ్డ పనులు చేస్తూ వుంటాడు. ఇలా జరుగుతున్న క్రమంలో 132 మందిని చంపినట్టు దాసరి శివాజీ కూతురు గాయత్రి పటేల్ కి విరుద్ధంగా సాక్షం చెపుతుంది. ఆ అమ్మాయి ని చంపడానికి గాయత్రి పటేల్ మనుషులు ప్రయత్నిస్తున్న సమయంలో వారికి అదే రూపంలో వున్న శివాజీ ఎదురవుతాడు. ఈ విషయం గాయత్రి పటేల్ తెలుసుకుని కథ మొత్తాన్ని మారుస్తాడు. గాయత్రీ పటేల్ కి కోర్టు ఉరిశిక్షను విధిస్తుంది కానీ గాయత్రీ పటేల్ శివాజీ కూతుర్ని అడ్డంపెట్టుకుని అన్యాయంగా దాసరి శివాజీని తన స్థానంలో జైలుకు పంపిస్తాడు. దాసరి శివాజీ తన కూతురు చివరికి కలుస్తారా...? గాయత్రీ పటేల్ కి శిక్ష పడుతుందా...? చివరికి దాసరి శివాజీ ఏమవుతాడు...? అనేది మిగతా కథ.


విశ్లేషణ: 


కలక్షన్ కింగ్ మోహన్ బాబు అభిమానులకు ఈ సినిమా ఒక పండగ అని చెప్పాలి. చాలాకాలం బ్రేక్ తర్వాత తిరిగి మళ్లీ హీరో గా మోహన్ బాబు అడుగుపెట్టారు. ఆయన వైవిధ్యమైన నటన, డైలాగ్ డెలివరీ, హావభావాలు ఇవన్నీ ఆయనలో ఇంకా అలాగే ఉన్నాయి. గాయత్రీ పటేల్ పాత్రలో మోహన్ బాబు చేసిన నటన సినిమా మొత్తానికే హైలెట్ గా నిలిచింది. ప్రేక్షకులకి ఈ సినిమాలో తిరిగి పాత మోహన్ బాబు కనిపిస్తాడు. మంచు విష్ణు, శ్రీయ వారి పాత్రలకు తగ్గట్టుగా బాగానే నటించారు. దర్శకుడు మదన్ రామిగాని చాలా చక్కగా సినిమాను తెరపై చూపించాడు. ఎక్కువసేపు సినిమాని పొడిగించకుండా కథలో ఉన్నది ఉన్నట్టుగా చూపించి తక్కువ సమయంలో సినిమాని ముగించేశాడు. దీని వల్ల ప్రేక్షకులుకు ఎక్కడా కూడా నిరాశ చెందడానికి ఉండదు. థమన్ తన ప్రతిభను మళ్లీ నిరూపించుకున్నాడు. ఈ సినిమాకి కథ ప్రధాన బలంగా నిలిచింది. కథ చెప్పే తీరు మాత్రం చాలా పాతది గా ఉంటుంది. అన్ని విభాగాల పనితీరు బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని చక్కగా ఉన్నాయి.


ఇకపోతే చివరి నలభై నిమిషాలకు గాయత్రి పటేల్ అనే పాత్ర సినిమా మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తుంది. ఆ పాత్రను చూసిన ఎవరైనా ఇంకా కొద్ది సేపు వుంటే బాగుండేది అన్నంత చక్కగా ఆ పాత్రను రక్తి కట్టించారు మోహన్ బాబు. ఆ చివరి ఘట్టాన్ని మిగతా సినిమా అంతటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మిగతా సినిమా అంతా సాదాసీదాగా తేలిపోయినట్లు ఉంటుంది, అదే  ఈ సినిమాకి పెద్ద మైనస్. 


బలం బలహీనతలు


ప్లస్ పాయింట్స్ : 


* సెకండాఫ్, ఫస్టాఫ్లో కొన్ని సీన్లు.


* మోహన్ బాబు నట విశ్వరూపం.


* తమన్ పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్.


* మంచు మనోజ్ , శ్రీయ.


* తండ్రీ కూతుర్ల మధ్య భావోద్వేగం.


మైనస్ పాయింట్స్:


* ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా ఉండటం.


* కథ చెప్పే విధానం.


* కామెడీ లేకపోవడం.


మొత్తంగా చెప్పుకోవాలంటే, మోహన్ బాబు నట విశ్వరూపం ఈ సినిమాలో కనిపిస్తుంది. మంచు మనోజ్, శ్రయ ఆకట్టుకున్నారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో అంతగా కనిపించవు. ఈ సినిమాను కేవలం మోహన్ బాబు గురించి అతను చేసిన అద్భుతమైన నటన గురించి చూడాలి.


Be the first to comment on Gayatri Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
గాయత్రి- జై హనుమాన్ పోస్టర్
గాయిత్రి పోస్టర్స్
Load moreవీడియోస్!!!