wallpaper
celebrity

హౌరా బ్రిడ్జ్
Views : 8826

1.30
|
|
Write a Review
విడుదల తేది : February 03, 2018, దర్శకుడు : రెవన్ యదు, టేక్నిషియన్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తారాగణం :రాహుల్ రవీంద్రన్, చాందిని చౌదరి
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
1.25
Verdict - రెండు గంటల సమయం వృధా...

హౌరా బ్రిడ్జి సినిమా రివ్యూ : 


నటీనటులు : రాహుల్ రవిచంద్రన్, చాందినీ చౌదరి, రావు రమేష్ , ఆలీ , మనాలి రాథోడ్.


దర్శకత్వం : రేవన్ యాధూ.


నిర్మాత : ఈ.ఎమ్.వి.ఈ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్.


సంగీతం : శేఖర్ చంద్ర.


ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు.


సినిమాటోగ్రఫీ : విజయ్ మిశ్రా.


అప్పట్లో అర్జున్ రెడ్డి పోస్టర్లు బస్సులపై వేయడంపై తీవ్రమైన వివాదాలకు దారితీసింది, మళ్లీ అంతటి స్థాయిలో కాకపోయినా హౌరా బ్రిడ్జి సినిమా పై కూడా అలాంటి వివాదమే నడిచింది. 'అందాల రాక్షసి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ హీరోగా, 'మధురం' అనే షార్ట్ ఫిల్మ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన చాందిని చౌదరి హీరోయిన్ గా 'హౌరా బ్రిడ్జ్' సినిమా ఈ వారం దియేటర్ లోకి వచ్చింది.రేవన్ యాధూ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ.ఎమ్.వి.ఈ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం నిర్మించారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతం అందించగా, కోటగిరి వెంకటేశ్వరరావు మరియు విజయ్ ఈ సినిమాకి ఎడిటింగ్ మరియు సినిమాటోగ్రఫీ చేసారు. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 


కథ : 


ఒక బ్రిడ్జ్ సాక్షిగా ఇద్దరు చిన్నపిల్లలు కలుసుకుంటారు, వీరి మధ్య అనుబంధం బలపడుతుంది.  అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోతారు.  పెరిగి పెద్దయిన తర్వాత తన చిన్నప్పటి స్నేహితురాలే తన జీవిత భాగస్వామిగా భావించి తిరిగి తన దగ్గరికి వెళ్తాడు. నాకు గుర్తు లేదు అన్నా సరే ఆ అమ్మాయి వెంట పడుతూ మొత్తానికి అమ్మాయిని ప్రేమలోకి దింపుతాడు హిరో. కథ సుఖాంతం అయిపోతుంది అనుకున్న సమయంలో హీరో కి ఊహించని విధంగా ఒక మలుపు ఎదురవుతుంది. ఏమిటా మలుపు..?? హీరో హీరోయిన్ చివరికి ఏమౌతారు....?? అన్నది మిగిలిన కథ.


విశ్లేషణ : 


పెద్ద సినిమాలు తీసే అవకాశం అందరికి రాదు కానీ చిన్న సినిమాలు తీసే అవకాశం మాత్రం చాలా మందికి ఉంటుంది‌. దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరూ పెద్ద స్థాయి కి వెళ్తారు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం పక్కనపెట్టి తనకు తోచినట్లు సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. హౌరా బ్రిడ్జి అనే సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా నచ్చే అంశం లేకపోవడం ఘోరాతి ఘోరం. దర్శకుడు విఫలమయ్యాడు, హీరో నటన పూర్తిగా విఫలమైందని చెప్పలేం కానీ అంత ప్రభావితంగా ఏమీ లేదు. హీరోయిన్ చాందినీ చౌదరి అంతంత మాత్రమేగానే నటించింది.


ఇక దర్శకుడే సరిగ్గా లేనప్పుడు మిగిలిన విభాగాలు ఏమేరకు పనిచేస్తాయి. ఒక స్టోరీ బాలేదు, స్క్రీన్ ప్లే బాలేదు, సినిమాను తీసుకెళ్లిన విధానం బాలేదు. కథ ఏమిటో అర్థంకాక ప్రేక్షకులు రెండుగంటల పాటు ఒక అయోమయానికి గురి అవుతారు. కామెడీ ఉన్నా లేనట్టే ఉంది. శేఖర్ చంద్ర పాటలు పర్వాలేదు కానీ అందులో వచ్చే లిరిక్స్ ప్రేక్షకులు చాలా నిరాశ పరుస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండును అనిపిస్తుంది. రావు రమేష్ అలీ, అజయ్ లాంటి పెద్ద పెద్ద పాత్రలు ఉన్నప్పటికీ ట్రైలర్ ల లో పోస్టర్ ల లో వేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు. సినిమాలో వారి పాత్రలకు పెద్ద చోటు ఉండదు. అవసరానికి మించి ఖర్చుపెట్టిన నిర్మాతల పనితనం తేలిపోయింది. ద్వితీయ అర్థం వచ్చే డైలాగులు, యువతను ఆకర్షించే సన్నివేశాలు ఇవి తప్ప సినిమాల్లో పెద్దగా ఏమీ కనిపించవు.


బలం బలహీనతలు 


ప్లస్ పాయింట్స్ : 


* రాహుల్  రవిచంద్రన్.


* విజయ్ సినిమాటోగ్రఫీ.


* చంద్రశేఖర్ సంగీతం.


మైనస్ పాయింట్స్ : 


* దర్శకత్వం , స్క్రీన్ ప్లే.


* కథ.


* ఎడిటింగ్.


మొత్తానికి హౌరా బ్రిడ్జి సినిమా గురించి చెప్పాలంటే, ఒక సినిమాని చూడాలంటే అందులో ఆకట్టుకునే అంశాలు అయినా ఉండాలి, లేకుంటే ఎవరికీ తెలియని ఓ కొత్త విషయం అయినా అందులో చూపించాలి, లేదా కనీసం కాసేపు హాయిగా చూడడానికైనా ఉండాలి. వీటిల్లో ఏ అంశాం కూడా ఈ సినిమాలొ కనిపించదు. పెద్ద సినిమాలు తీసే అవకాశం అందరికీ దొరకదు కాని, చిన్న సినిమాలు తీసే అవకాశం మాత్రం చాలామందికి ఉంటుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోంటే బావుంటుంది.


Be the first to comment on Howra Bridge Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
హౌరా బ్రిడ్జి పోస్టర్స్
హౌరా బ్రిడ్జ్ స్టిల్స్
హౌరా బ్రిడ్జ్ పోస్టర్స్
Videos
Load moreవీడియోస్!!!
Latest News