wallpaper
celebrity

ఇది నా లవ్ స్టోరీ
Views : 13207

2.70
|
|
Write a Review
విడుదల తేది : February 14, 2018, తారాగణం :తరుణ్ కుమార్, ఓవియా
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.00
Verdict - ఇది నా లవ్ స్టోరీ
no review available

Reviewed By : Vijay MOVIE JOCKEY
2.00
Verdict - Very very disappointed..!

నటీనటులు : తరుణ్, ఓవియ


దర్శకత్వం : రమేష్ గోపి


నిర్మాత : ఎస్.వి. ప్రకాష్


సంగీతం : శ్రీనాథ్ విజయ్


సినిమాటోగ్రఫర్ : క్రిస్టోఫర్ జోసెఫ్


ఎడిటర్ : శంకర్


ఒకప్పుడు టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఏకైక హీరో తరుణ్, తరుణ్కి అప్పట్లో యువత నుంచి మంచి ఫాలోయింగ్ ఉండేది, అయితే రొటీన్ కథలను చేస్తుండటం వలన సినీ ఇండస్ట్రీలో ప్రాముఖ్యత తగ్గిపోయింది. సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నంతో చేసిన సినిమా ‘ఇది నా లవ్ స్టోరీ’. రమేష్ గోపి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం.


కథ :


యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసే అభిరామ్ (తరుణ్) షూటింగ్ కోసం అరకు వెళ్తాడు. అక్కడ వాళ్ళ చెల్లెలు బలవంతపెట్టడంతో శృతి అనే అమ్మాయిని చూడ్డానికి వెళ్తాడు. కొంతకాలం ప్రయాణం తర్వాత శ్రుతి తనకి బాగా నచ్చుతుంది తన ని  ప్రేమిస్తాడు. కానీ అక్కడ శృతి స్థానంలో ఉన్నది తాననుకుంటున్న శృతి కాదని అభినయ(ఓవియ) అనే వేరే అమ్మాయని తెలుస్తుంది.


నిజం తెలిసిన అభి ఆమెను నిలదీస్తాడు. ఆమె కూడా తన అబద్దం వెనకున్న కారణాన్ని చెప్తుంది. ఇద్దరూ ఒకరి ప్రేమను మరొకరు అంగీకరిస్తారు. కానీ ఇంతలోనే కథ ఒక విచిత్రమైన మలుపు తీసుకుంటుంది.  అభినయ (ఓవియ), అభి (తరుణ్) పై కేసు పెట్టి పోలీసులకు అప్పగిస్తుంది. అసలు అభి (ఓవియ), అభి (తరుణ్)ని ఎందుకు పోలీసులకు అప్పచెప్పింది ? గతంలో ఒకసారి ప్రేమలో విఫలమై ఉన్న అభి రెండోసారైనా ప్రేమను దక్కించుకున్నాడా లేదా ? ఇది మిగిలిన కథ.


విశ్లేషణ:


ముందుగా ఒక విషయం లేని సినిమాకి ఇంతలా ప్రమోట్ చేయడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ట్రైలర్ లో కనిపించే సినిమా వేరు, ధియేటర్ లో వేసిన సినిమా వేరు అనుకునేంత గా ట్రైలర్లను ప్రోమోలను కట్ చేశారు ఈ సినిమా యూనిట్. చాలా రోజుల తర్వాత హీరోగా తిరిగి రీఎంట్రీ ఇచ్చినా తరుణ్ మంచి కథను ఎంచుకున్నాడు. ప్రతి ప్రేమికులు విడిపోవడం వెనుక స్వార్థం మాత్రమే ఉండదు నిజమైన కారణం కూడా ఉంటుంది అని తెలియజెప్పడమే ఈ కథ యెక్క ముఖ్య ఉద్దేశ్యం. కానీ దర్శకుడు రమేష్ గోపి ఈ సినిమాకి ఏ మాత్రం న్యాయం చేయలేదు. ఇంకా చెప్పాలంటే చాలా అన్యాయం చేశాడు. ఈ సినిమా ఒక కన్నడ రీమేక్ సినిమాగా చెప్తున్నారు. భావోద్వేగానికి లోనై కథను ఎంచుకోవడంలో విజయం సాధించాడు కానీ అదే భావోద్వేగానికి ప్రాధాన్యమిచ్చే దర్శకుడిని తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కథ మరియు తరుణ్ నటన, పదేళ్ల విరామం తర్వాత కూడా తరుణ్ అంతే అందంగా కనిపించాడు. తన ఒంటి చేత్తో సినిమాని నడిపించాడు అని చెప్పొచ్చు. మిగిలిన విభాగాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఏ విభాగం పనితీరు బాగో లేదు.


నిర్మాత విలువలు కూడా అంతంతమాత్రంగానే కనిపించాయి. పాటల్లో కొత్తదనం లేదు. చాలాకాలం తరవాత తరుణ్ ని మళ్లీ సినిమా తెరపై చూసిన ఆనందం తప్ప ఈ సినిమా చూడ్డం వలన వచ్చేదేమీ ఉండదు, నిరాశ కలగడం తప్ప. డైలాగులు బాగున్నాయి కానీ సమయం సందర్భం లేకుండా వస్తూ ఉంటాయి. 


బలం బలహీనతలు


ప్లస్ పాయింట్స్:


* తరుణ్ నటన, పదేళ్ల తర్వాత కూడా అంతే అందం గా ఈ సినిమాలో కనిపించాడు.


* కథ.


* అక్కడక్కడ ఒకటి రెండు సన్నివేశాలు.


మైనస్ పాయింట్స్ : 


* దర్శకుడు పనితీరు.


* ఓవియ నటన.


* అర్థంకాని స్క్రీన్ ప్లే.


* పాటలు


మొత్తంగా చెప్పుకోవాలంటే, 'ఇది నా లవ్ స్టోరీ' సినిమాలో పదేళ్ల తర్వాత కూడా అంతే అందంగా నటించాడు లవర్ బాయ్ తరుణ్. అందరూ ఆశించారు ఈ సినిమా తరుణ్ కి మంచి కమ్ బ్యాక్ ఫిలిం అవుతుందనీ, అయ్యేదేమో ఒక మంచి దర్శకుడు ఈ సినిమాను తీసి ఉంటే. మంచి కథ ఉన్నప్పటికీ, దర్శకుడి పనితనం లేక, నిర్మాణ విలువలు సరిపోక ఈ సినిమా తీవ్రమైన నిరాశను మిగిల్చింది.


Reviewed By: Subba Rao Anonymous
5.00
it's good film
4 different love stories and they all are good

Reviewed By: Manish Golagana Anonymous
3.00
Tollywood times
Movie average tarun performance super 3rolls lo super asalu motham tarun one man show ide comeback film direction lo tappu akkava punch dialoges chirakk tapinchayi but one time watch for tarun

 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
ఇది నా లవ్ స్టోరీ మూవీ వర్కింగ్ స్టిల్స్
ఇది నా లవ్ స్టోరీ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ వద్ద ఓవియా
ఇది నా లవ్ స్టోరీ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఫోటోస్
Load moreవీడియోస్!!!
Latest News