wallpaper
celebrity

ఇంటిలిజెంట్
Views : 12188

2.60
|
|
Write a Review
విడుదల తేది : February 09, 2018, దర్శకుడు : వి.వి.వినాయక్, నిర్మాత : సి కళ్యాణ్, టేక్నిషియన్ : తమన్, తారాగణం :సాయి ధరమ్ తేజ్, లావణ్య , నాజర్
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.00
Verdict - ఇంటెలిజెంట్
no review available

Reviewed By : Vijay MOVIE JOCKEY
2.25
Verdict - ఇంటెలిజెంట్ సినిమా పై పూర్తి రివ్యూ : మతి పోయింది అంతే..??

నటీనటులు : సాయి ధరంతేజ్, లావణ్య త్రిపాఠి, పోసాని మురళి కృష్ణ , పృధ్వీరాజ్ , నాజర్, బ్రహ్మానందం.


దర్శకత్వం : వి.వి.వినాయక్.


నిర్మాత : సి.కళ్యాణ్.


సంగీతం : ఎస్.ఎస్.తమన్.


కథ : ఆకుల శివ.


సినిమాటోగ్రఫీ : ఎస్.వి. విశ్వేశ్వర్.


'ఇంటిలిజెంట్' సాయి ధరమ్ తేజ్ హీరోగా లావణ్య త్రిపాటి హీరోయిన్ గా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వి.వి.వినాయక్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై మెగా అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. సినిమాని సి.కళ్యాణ్ నిర్మించారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేశాడు. ఆకుల శివ ఈ సినిమాకి కథను అందించారు. పోసాని మురళి కృష్ణ , పృధ్వీరాజ్ , నాజర్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈవారం ఇంటిలిజెంట్ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది, ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒక సారి చూద్దాం.


కథ :


విజ‌న్ సాఫ్ట్ వేర్ సొల్యూష‌న్స్ అధినేత నంద‌కిషోర్ (నాజ‌ర్‌) ఆఫీస్ లో తేజ (సాయిధ‌ర‌మ్ తేజ్‌) పనిచేస్తుంటాడు. పేదవారికి సహాయం చేయడం , ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటివి నందకిషోర్ చేస్తుండడం తో ఆయన ఆదర్శంతో తేజు కూడా మంచి పనులే చేస్తూ ఉంటాడు. ఓ రోజు సంధ్య (లావణ్య త్రిపాఠి ) ను చూసిన తేజు , ఆమెను ఇష్టపడతాడు. కానీ ఆమెకు మొదట్లో తేజు అంటే ఇష్టం ఉండదు. కానీ ఆడవారి పట్ల తేజు కు ఉన్న గౌరవం చూసి ఇష్టపడుతుంది.


అదే స‌మ‌యంలో నంద‌కిషోర్ మంచి తనం చూసిన కొంతమంది అతడిని దెబ్బ కొట్టి, కంపెనీని సొంతం చేసుకోవాల‌నుకుంటారు. అయితే అనుకోకుండా త‌న కంపెనీ ని విక్కీకి(మాఫియా డాన్) రాసేసి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు నంద‌కిషోర్‌. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? అసలు నందకిషోర్ ఆత్మ హత్య చేసుకున్నాడా..? ఎవరైనా చంపేసి అలా ఆత్మ హత్య కింద సృష్టించారా..? ధర్మాభాయి ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఎవరు ఈ ధర్మాభాయి..?? అనేది మిగతా కథ..


విశ్లేషణ : 


మనం ఆపదలో వున్నప్పుడు మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు ఆ తరువాత ఎప్పుడైనా వారు ఆపదలో ఉన్నప్పుడు వారి కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం.  'ఖైది నెంబర్ 150' సినిమాతో వి.వి.వినాయక్ తన ప్రతిభను మళ్లీ నిరూపించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే, కానీ 'ఇంటిలిజెంట్' సినిమా విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం తన పనితనం పై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు, పైగా ఈ సినిమా వి.వి.వినాయక్ దర్శకత్వం వహించాడా..? ఇది వివి వినాయక్ సినిమా కాదు అనే సందేహం ప్రేక్షకుల్లో కలగకమానదు.  అంతగా  ప్రేక్షకుల మతి పోగొట్టేశాడు వి.వి.వినాయక్. వి.వి.వినాయక్ సినిమాలని హీరో ఎలివేషన్ కోసం చూడొచ్చు అంటారు, కానీ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ని కనీసం ఒక సాధారణ హీరో కింద కూడా ఎలివేట్ చెయ్యకపోవడం అర్థం కాని విషయం. ఆకుల శివ కథలో ఇంటిలిజెన్స్ చాలా ఎక్కువైపోయింది, ప్రతి సీనూ కూడా ప్రేక్షకుడికి ముందుగానే అర్థమైపోతుంది. ఏ మాత్రం కొత్తదనం లేని కథ రాసుకున్నాడు ఆకుల శివ. ఈ కథ కళ్యాణ్ కి ఎలా నచ్చిందో. ఈ కథ ను నమ్మి సినిమా తీయడం గొప్ప విషయం. ఇంట్రడక్షన్ చూసిన ప్రేక్షకుడు క్లైమాక్స్ వరకూ కూడా చెప్పేయొచ్చు అంత పేలవంగా ఉంది. దర్శకత్వం బాలేదు. స్క్రీన్ ప్లే బాలేదు. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ లో కూడా వి.వి.వినాయక్ మార్క్ కనిపించకపోవడం దారుణం. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ విషయానికి వస్తే పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర ఏమీ చేయలేదు, పాటలు, ఫైట్లు, నటన వరకూ చిరంజీవిని పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేసినట్టు ఉంటుంది. ఇలాగే కనుక ఇంకో రెండు మూడు సినిమాలు కనుక చేస్తే సాయి ధర్మతెజ్ కెరీర్ సంక్షోభంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.


లావణ్య త్రిపాటి తన పాత్రకు తగ్గట్టుగా చేసింది.  సి.కళ్యాణ్ నిర్మాణ విలువలు పరవాలేదు.  పోసాని మురళి కృష్ణ, సప్తగిరి వారి పాత్రలకు న్యాయం చేశారు. పృధ్వీరాజ్ పరవాలేదనిపించాడు. ఈ సినిమాలో పాటల విషయానికొస్తే తమన్ పాటలు బాగున్నాయి, కథ చూసి చూసి చిరాకు పుట్టినప్పుడు కనీసం పాటలు చూసి ఆస్వాదించొచ్చు. పాటల కొరియోగ్రఫీ బాగుంది.


బలం బలహీనతలు 


ప్లస్ పాయింట్స్ : 


* సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి నటన, డ్యాన్సులు.


* అక్కడక్కడ పృధ్వీరాజ్ కామెడీ.


* పాటలు, నిర్మాణ విలువలు.


మైనస్ పాయింట్స్ : 


* కథ, కథనం.


* దర్శకత్వం.


* డైలాగులు.


* అర్థంకాని సన్నివేశాలు, సినిమాలో లాజిక్ లేకపోవడం.


* ఫస్టాఫ్లో వచ్చే కామెడీ.


మొత్తంగా చెప్పుకోవాలంటే సాయి ధరమ్ తేజ్ నటించిన 'ఇంటెలిజంట్' సినిమా కేవలం సాయి ధరంతేజ్ చేసిన డ్యాన్స్ లకి నటనకు వెళ్లొచ్చు, ఇవి తప్పించి ఈ సినిమా నుంచి ఆశించడానికి ఏమీ లేదు. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్ ఈ సినిమాల జాబితాలోనే ఇంటిలిజెంట్ సినిమా కూడా చేరిపోయింది. ముఖ్యంగా వి.వి.వినాయక్ దర్శకత్వం మీద ఎటువంటి ఆశలు పెట్టుకోకుండా సినిమాకి వెళితే చాలా మంచిది. 


Reviewed By: Bala Krishna Anonymous
2.50
Intliejent
Cinema okkasriku choodavachu saptagiri mariu posani acting super Lavanya is okkkk but music is just disappointed inka Sai anna acting suite super peaks vinayak gari direction okkkk my review is 2.5/5

 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
ఇంటిలిజెంట్ సాంగ్ లాంచ్
ఇంటిలిజెంట్ మూవీ స్టిల్స్
Videos
Load moreవీడియోస్!!!
Latest News