wallpaper
celebrity

జవాన్
Views : 14913

3.00
|
|
Write a Review
విడుదల తేది : December 01, 2017, దర్శకుడు : బి.వి.యస్.రవి, నిర్మాత : దిల్ రాజు, కృష్ణ, టేక్నిషియన్ : తమన్, తారాగణం :సాయి ధరమ్ తేజ్, మెహరీన్, ప్రసన్న (స్నేహ)
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
2.75
Verdict - జవాన్ పర్ఫెక్ట్ రివ్యూ.....

జవాన్ పర్ఫెక్ట్  రివ్యూ.....


కొద్దిరోజుల క్రితం నుంచి 'జవాన్' సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయిన విషయం అందరికి తెలిసిందే, నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా పర్ఫెక్ట్ రివ్యూ ఇప్పుడు చూద్దాం...


హీరో'సాయిధరమ్ తేజ్' నటించిన ముందు చిత్రాలు వరుసగా ఫ్లాపులు కావడం, ఈ చిత్రం డైరెక్టర్ 'రవి' తన ముందు చిత్రం కూడా ఫ్లాప్ కావడం ఇలాంటి కారణాలతో ఈ సినిమా మొదట్లో అంత అంచనాలకు నోచుకోలేక పోయింది, కానీ సినిమా ట్రైలర్ చూశాక అందరూ ఒక్కసారిగా ఈ సినిమాపై మాట్లాడుకోవడం మొదలుపెట్టారు, ఇదే సమయాన్ని వృధా చేసుకోకుండా చిత్ర యూనిట్ అంతా కూడా ప్రమోషన్స్ లో మునిగిపోయింది, ఎంతమేరకు వాళ్ళ కష్టం ఫలించిందో చూద్దాం...


జవాన్: దేశం కోసం కుటుంబాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డే ఒక యువకుడు (జై), అదే దేశం ఏమై పోయినా పర్లేదు తాను బాగుండాలని కోరుకునే ఇంకొకడు (కేశవ), వీరిద్దరూ చిన్నప్పుడు స్నేహితులు అయినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఒకరి నుంచి ఒకరు దూరంగా వెళ్లి పోతారు, అయితే హీరో కి మంచి కుటుంబం ఉంటుంది, తన తండ్రి ద్వారా హీరోకి దేశభక్తి ఏర్పడుతుంది, దేశం కోసం ఒక్క సగటు పౌరుడు ఎలా ఉండాలో ఈ సినిమాలో హీరో అలా ఉంటాడు అని చెప్పొచ్చు, అయితే ఇదిలా ఉండగా రెండోవాడు దేశాన్ని నాశనం చేసే పనిలో ఉంటాడు, వందలకోట్లకు దేశ సంపదను అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, దీనికి హీరో అడ్డుతగులుతాడు, హీరో ఫ్యామిలీని అడ్డుపెట్టుకుని విలన్ హీరోతోనే ఈ పని చేయించాలని అనుకుంటాడు, దేశం కోసం కుటుంబాన్ని చంపుకుంటడా లేదా ?? అనేది మిగతా కథ.....


ఫస్టాఫ్లోకొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా హీరోయిన్ (మెహరీన్) అలియాస్ భార్గవి  మధ్యలో వస్తూ పోతూ ఉండటంవల్ల స్టోరీ మీద ఇంట్రెస్ట్ కాస్తా పోతుంది, ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గిస్తే ఇంకా బాగుండేది, సెకండాఫ్లో వచ్చేసరికి సినిమా కథ ఎలా మలుపు తిరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే ప్రతి ప్రేక్షకుడికీ కథ మీద పూర్తి అవగాహన వస్తుంది, సెకండాఫ్లో వచ్చేసరికి మాత్రం మనకి పాత సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి, ఆది నటించిన 'ప్రేమ కావాలి', 'రామ్ చరణ్' నటించిన 'ధ్రువ', ఆ సినిమాలు మాదిరే ఈ సినిమాలో కూడా చాలా సీన్లు ఉంటాయి, మలుపులు పెద్ద ఆసక్తిగా లేకపోయినప్పటికీ క్లైమాక్స్ లో ఏదో ఉందనిపిస్తుంది, క్లైమాక్స్ కి వచ్చేసరికి మాత్రం హడావిడి చేస్తూ సింపుల్గా అయిపోతుంది, కొద్దిపాటి అసంతృప్త సినిమా నుంచి బయటకు రావాల్సి వస్తుంది....


ప్లస్ పాయింట్స్ అంటే హీరో, విలన్ ల నటనలనే చెప్పుకోవచ్చు, హీరోయిన్ తన పాత్రకు న్యాయం చేస్తూ వచ్చింది, ఇతర నటీనటులు కూడా వారి వంతు కృషి చేశారు, మైనస్ పాయింట్స్ వచ్చేసరికి సినిమా లో అర్థం కాకుండా వచ్చే పాటలు, పాత కథనం, ఫస్టాఫ్ బాగున్నప్పటికి సెకండాఫ్ అంతులేదు, సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ వల్ల సినిమా పర్వాలేదనిపించుకుంది.


కుటుంబంతోచూడతగ్గ సినిమా అయినప్పటికీ కామెడీ లేకపోవడంతో కొంచెం చప్పగా ఉన్నప్పటికీ పర్వాలేదనిపిస్తుంది, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే సినిమా ఓ మాదిరిగా నచ్చుతుంది, ఈ సినిమాకి హిట్ అయ్యే చాన్స్ లేనప్పటికీ ఫ్లాఫ్ అవ్వలేదని చెప్పుకోవాలి.


Be the first to comment on Jawaan Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
జవ్వాన్ పోస్టర్స్
విజవాడ ఎయిర్ పోర్ట్ లో జవాన్ మూవీ టీం ఫొటోస్
కానక దుర్గ టెంపుల్ లో జవాన్ మూవీ టీం ఫొటోస్
Videos
Load moreవీడియోస్!!!
Latest News