కాలా | కాలా Review | Rating | కాలా News | Release Date | In Theaters | కాలా Pics | Photos | Images | Wallpapers | కాలా Direcrtor | Producer | Music | Cast | Technicians :: TollywoodTimes
విడుదల తేది : June 07, 2018, దర్శకుడు : రంజిత్, తారాగణం :రజినీకాంత్
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.00
Verdict - కాలా పూర్తి రివ్యూ

No review available 


Reviewed By : Vijay MOVIE JOCKEY
3.00
Verdict - రాజకీయాన్ని ఆస్వాదిస్తూ చూస్తే మస్తు మజా వస్తుంది.

నటీనటులు : రజనీకాంత్‌, హ్యూమా ఖురేషి, నానా పాటేకర్‌


దర్శకత్వం : పా. రంజిత్‌


నిర్మాత : ధనుష్‌


సంగీతం : సంతోష్‌ నారాయణన్‌


సినిమాటోగ్రఫర్ : మురళి జి


ఎడిటర్ : శ్రీకర్‌ప్రసాద్‌


స్క్రీన్ ప్లే : పా. రంజిత్‌


 


'కాలా', రజినీ కాంత్ రాజకీయాల్లోకి వచ్చాక వచ్చిన మొదటి సినిమా కావడంతో సినిమా లో ఎలాంటి సందేహం ఇస్తారో అని అటూ రజినీ కాంత్ అభిమానుల్లోనే కాక ఇటు రజినీ కాంత్ ను దూరంగా ఉండి చూస్తున్న తెలుగు ప్రేక్షకులలోనూ చాలా ఆసక్తి నెలకొంది. మొత్తానికి సమయం వచ్చింది, రజినీ కాంత్ సినిమా విడుదల అయింది. మరి భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..


 


కథ:


ముంబై నడిబొడ్డున ఉన్న పేద ప్రజల మురికివాడ (ధారావి) ఆ మురికివాడకి తిరుగులేని నాయకుడు కరికాలుడు (రజనీకాంత్). ఎన్ని ఆపదలొచ్చినా ఆ ప్రదేశాన్ని, ప్రజల్ని కాపాడుతుంటాడు కాలా. కానీ ముంబైలోని ప్రముఖ రాజకీయ పార్టీ లీడర్ హరిదాస్ (నానా పటేకర్) ఎన్నో ఏళ్ల నుండి ధారావిని సొంతం చేసుకోవాలని ట్రై చేస్తుంటాడు.


 


అధికారం తన చేతిలోకి రాగానే ప్రజల్ని మభ్యపెట్టి ధారావిని ఆక్రమించాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. కానీ అక్కడి ప్రజలు, వాళ్ళ నాయకుడు కాలా హరిదాస్ కు అడ్డుపడతారు. దాంతో హరిదాస్ కాలాపై పగబడతాడు. అలా కాలాను టార్గెట్ చేసిన హరిదాస్ అతన్ని ఎలా కష్టపెట్టాడు, వాటన్నిటినీ ఎదుర్కొని కాలా తన వాళ్ళని, ధారావిని ఎలా కాపాడుకున్నాడు, ఆ పోరాటంలో అతను ఏం కోల్పాయాడు అనేదే సినిమా.


 


విశ్లేషణ : 


రజినీ కాంత్ సినిమా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది స్టైల్, యాక్షన్ సీన్స్, ఎంట్రన్స్ ఇవి చాలు అభిమానులు ఆనందం తో ఊగిపోతారు. కాలా లో ఇలాంటి అంశాలు లెక్కకు మించి ఉంటాయి. ఈ సినిమాతో దర్శకుడిగా (కబాలి ఫేం) రంజిత్ పనిచేసారు. దర్శకుడు గా రంజిత్ కి మంచి మార్కులే పడ్డాయి, కారణం అతను ఎలా చెప్పాలి అని అనుకున్నాడో సినిమా ను కూడా అలాగే తీశారు. ప్రతి సినిమాలో ఒక మాస్ ఎలెమెంట్స్ వచ్చే ముందు సినిమా నెమ్మదిగా వుండాలి అప్పుడే ఆ మాస్ సీన్ బాగా పండుతుంది. అయితే ఈ సినిమాలో నెమ్మదిగా రావాల్సిన సీన్స్ చాలా చిరాకు పుట్టిస్తాయి, అలాంటి సీన్స్ లేకపోతేనే బాగుటుందేమో అనిపిస్తుంది, ఇది సినిమాకు పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి. సినిమా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మంచి మాస్ సీన్స్ తో సినిమాని ఆసక్తికరం గా చేశారు. ఇంకా  రజినీకాంత్ నటించిన తీరు వర్ణించలేము, చూస్తూ ఉండిపోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. రజినీ కాంత్ - నాన పటేకర్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి. హీరోయిన్లు ఇద్దరు పరవాలేదు అనిపించారు. ముఖ్యంగా ఈశ్వరి నటన చాలా బాగుంది, హ్యూమా తన పాత్రకు సరిగ్గా సరిపోయింది, రజినీ కాంత్ ఇంటర్వెల్ సీన్లో మనల్ని తన 'ధారావి' లోకి తీసుకెళ్ళి పడేస్తాడు ఆ ఒక సీన్ సినిమాకే హైలెట్గా నిలిచింది. తదితర నటీనటులు వారి పాత్రలకు తగ్గట్టుగా నటించారు.


 


నిర్మాణ విలువలు బాగున్నాయి సినిమాని పిక్చరేస్ చేసే విషయంలో ధనుష్ ఎక్కడా రాజీపడలేదు. వారు పడిన కష్టం సినిమాలో కనిపించింది. సంతోష్‌ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది, ఒక్క పాట మినహా అన్నీ బాగున్నాయి. మురళి సినిమాటోగ్రఫీ, శ్రీకర్‌ప్రసాద్‌ ఎడిటింగ్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.


 


బలం, బలహీనతలు


ప్లస్ పాయింట్స్ : 


* రజినీకాంత్ నటన.


* ఫస్టాఫ్లో వచ్చే మాస్ సీన్స్.


* ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్.


 


మైనస్ పాయింట్స్ :


* చాలా సన్నివేశాలు సాగదీసినట్టు ఉంటాయి.


* క్లైమాక్స్.


* కథ అంత లేకపోవడం.


 


మొత్తానికి ఈ సినిమా రజినీ కాంత్ అభిమానులను అలరిస్తుంది అనడంలో సందేహం లేదు, మరి మిగిలిన ప్రేక్షకులను కూడా అలరిస్తుందో లేదో చూడాలి.  దర్శకుడు రజినీ కాంత్ ను చూపించే విధానం కోసం, రజినీ నటన కోసం ఈ సినిమాని చూడొచ్చు. సినిమాపై విపరీతమైన అంచనాలు పెట్టుకుంటే చివరికి నిరాశ పడతారు అందులో సందేహం లేదు. తక్కువ అంచనాలతో వెళ్ళితే మాత్రం సినిమా చాలా బాగుంటుంది.


Be the first to comment on Kaala Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Videos
Load moreవీడియోస్!!!
Latest News
Juke box