wallpaper
celebrity

సప్తగిరి LLB
Views : 1118

3.30
|
|
Write a Review
విడుదల తేది : December 07, 2017, తారాగణం :సప్తగిరి, సాయి కుమార్, యన్ .శివ ప్రసాద్
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.25
Verdict - సప్తగిరి
మంచి కథ దారి తప్పిన కథనం ....


గత ఏడాదిలో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నటుడు సప్తగిరి, తాను చేసిన రెండో ప్రయత్నం ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’. ఈ చిత్రం హిందీ సినిమా కు అనువాద చిత్రంగా వచ్చింది, డా.కె.రవి కిరాన్ ఈ సినిమాకి నిర్మాత గా చేసారు, చరణ్ లక్కాకుల ఈ సినిమా కి దర్శకత్వం వహించారు, సంగీత దర్శకుడుగా బుల్గేన్ చేసారు, హిరో హిరొయిన్ల గా సప్తగిరి, కాశిష్ వోహ్రా నటించారు.


సినిమా గురించి చెప్పాలి అంటే మంచి కథ తో నిరసం తెప్పించే కథనంతో సాగుతోంది, టాలీవుడ్ లో మూడు పాటలు నాలుగు ఫైట్లు వుంటే చాలు.. సినిమా హిట్టు అయిపోతుంది అని అందరూ అనుకుంటున్న విషయమే, కానీ దీని ప్రభావం ప్రేక్షకులు మీద ఎంత ఉందో తెలీదుగానీ దర్శకులు మీద మాత్రం గట్టిగానే వుంది, సరిగ్గా ఈ ప్రభావం 'సప్తగిరి ఎల్ ఎల్ బీ' సినిమా మిద కూడా పండింది.


కథ లోకి వెళ్లితే చిత్తూరులో ఉంటూ ఎల్.ఎల్.బి పూర్తి చేసిన సప్తగిరి లాయర్ గా ఎదిగి మంచి పేరు, డబ్బు సంపాదించి తన మరదలను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ కి వస్తాడు, అలాంటి తరుణం లోనే అతను ప్రముఖ లాయర్ రాజ్ పాల్ (సాయి కుమార్) వాదించి తీర్పు రాబట్టుకున్న ఒక కేసు పై సప్తగిరి పిల్ వేసి దాన్ని రీ ఓపెన్ చేయిస్తాడు. అసలు సప్తగిరి ఆ కేసుని ఎందుకు రీ ఓపెన్ చేయిస్తాడు, ఆ కేసు కథేంటి, పేరు మోసిన లాయర్ రాజ్ పాల్ ను సప్తగిరిని ఎలా ఢీ కొట్టాడు, చివరికి కేసు గెలిచాడా లేదా అనేది మిగతా సినిమా...


ప్లస్ పాయింట్స్: సప్తగిరి, సాయి కుమార్, శివ ప్రసాద్  నటనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కథను ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సాయికుమార్ సప్తగిరి మధ్య జరిగే కోర్టు సీన్లు బాగున్నాయి, ప్రిక్లైమాక్స్ కూడా బాగుంది, కథను మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసారు.


మైనస్ పాయింట్స్: సినిమాకు ప్రధాన బలహీనత ఆకట్టుకునే కథనం లేకపోవడం, మధ్య మధ్యలో వచ్చే హీరో లవ్ ట్రాక్, పాటలు కథనానికి అడ్డుతగులుతున్నట్లు తోచాయి. కామెడీ ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు.


సినిమా పై ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లితే సినిమా నచ్చే అవకాశం ఉంది ..... 


3/5

Be the first to comment on Sapthagiri LLB Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
not rated
-  
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
నాని లాంచ్ సప్తగిరి లలబి మూడవ సాంగ్ ఫొటోస్
సప్తగిరి LLB 2nd లాంచ్ బై సాయి ధరమ్ తేజ్ ఫొటోస్
Load moreవీడియోస్!!!
Latest News