విడుదల తేది : May 18, 2018, దర్శకుడు : , టేక్నిషియన్ : విజయ్ అంటోనీ, తారాగణం :విజయ్ అంటోనీ, అంజలి
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
2.50
Verdict - తెలుగు నేటివిటీకి చాలా దూరంగా..

నటీనటులు : విజయ్ ఆంటోని, అంజలి, సునైన


దర్శకత్వం : కిరుతిగ ఉదయనిధి


నిర్మాత : విలియ‌మ్ అలెగ్జాండ‌ర్


సంగీతం : విజయ్ ఆంటోనీ


సినిమాటోగ్రఫర్ : రిచర్డ్ ఎమ్. నాథన్


ఎడిటర్ : లారెన్స్ కిషోర్


స్క్రీన్ ప్లే : కిరుతిగ ఉదయనిధి


 


‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన విజయ్ ఆంటోనీ, వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు, కాని అది పనిచేయడం లేదు. కొంత గ్యాప్ తరువాత మళ్ళీ ఇప్పుడు ‘కాశీ’ సినిమాతో వస్తున్నాడు. చాలా కాలంగా తెలుగులో కనిపించని అంజలి మళ్లీ తిరిగి ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ముతువెల్ కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ భార్య కిరుతిగా ఉదయనిధి దర్శకురాలు గా పనిచేశారు. విజయ్ ఆంటోనీ ఏప్పటిలాగే ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడు గా చేశారు. 'కాశీ' సినిమా ఈ శుక్రవారం ధియేటర్ లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.


 


కథ:


అమెరికాలోని భరత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చీఫ్ భరత్ (విజయ్ ఆంటోనీ) జీవితంలోని అన్ని రకాల సుఖాలతో హాయిగా ఉంటాడు. కానీ చిన్ననాటి జ్ఞాపకం ఒకటి అతన్ని పెద్దయ్యాక కూడ వెంటాడుతూ ఉంటుంది. ఆ తరుణంలోనే అతనికి తన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు తన కన్న తల్లిదండ్రులు కారని తెలుస్తుంది.


దీంతో అతను తనను కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఇండియా బయలుదేరుతాడు. అలా ఇండియా వచ్చిన భరత్ తన తల్లి దండ్రుల్ని కనుక్కోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఇంతకీ అతని తల్లిదండ్రులెవరు అనేదే తెరపై నడిచే సినిమా.


 


విశ్లేషణ : 


విజయ్ ఆంటోనీ ఈ సినిమా మొత్తానికి ప్రధాన బలం గా నిలిచాడు. పాటలు బాగున్నాయి, నటన పర్వాలేదు, మరి కొన్ని విభాగాల్లో బాగానే నటించాడు. కాని మొదటి సినిమా నుంచి ఒకే విధంగా నటిస్తూ వస్తున్నారు. ఈ సినిమా లో ముఖ్యంగా 3 ప్రత్యేక పాత్రలలో నటించారు విజయ్ ఆంటోనీ. కానీ సినిమా చూస్తున్న ప్రేక్షకుల కి మాత్రం మూడు పాత్రల్లో నటించిన ఫీలింగ్ కలగదు, జస్ట్ గెటప్ మాత్రమే మారుతుంది మిగతాదంతా ఒకటే. హీరోయిన్ అంజలి పర్వాలేదు అనిపించింది, మిగిలిన ముగ్గురు హీరోయిన్ లు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇతర నటీనటులు అందరూ పర్వాలేదు అనిపించారు. 


కాని అసలు రచ్చ ఇక్కడే మొదలైంది, వంట చేయడానికి వంట సమానులు మాత్రమే వుంటే సరిపోదుగా వంట రుచికరంగా వుండాలి అంటే వంట వచ్చిన మనిషి వుండాలి. ఈ  సినిమా లో వంట మనిషికి అదే ఈ సినిమా డైరెక్టర్ కి పెద్ద అనుభవం లేనట్టే కనిపించింది, ఈ సినిమా అంతా కూడా తమిళ్ వాసన ఎక్కువగా వచ్చింది ఎంతైనా తమిళులు కోసం చేస్తున్న వంట కదా ఆ మాత్రం రావడంలో తప్పు లేదు కానీ మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది, ఏదో చూపిస్తున్నాం వాల్లే చూస్తారు లే అనట్టు సాగింది ఎవ్వారం. ఒక 28 యేళ్లు వయసు వున్న హీరో తనకోసం ప్రాణాలు కోల్పోయిన తల్లి మొహం ఎలా వుంటుందో చూడాలి అనే తపన, తన తల్లిని మోసం చేసిన తన తండ్రి ఎవరు అస్సలు 28 యేళ్లు క్రితం ఏం జరిగింది అనే చక్కటి స్టోరీ లైన్ తో మొదలైన కథ ఇష్టమొచ్చినట్టు తీశారు.


తన తండ్రి కోసం వెతుకుతున్న సమయంలో మరో రెండు కథలను వినాల్సి వస్తుంది. అవి చాలా నెమ్మదిగా చికాకు కలిగిస్తాయి, కానీ ఆ కథలకు చివరిలో వచ్చే తన తండ్రి కథకు కొన్ని సంబంధాలు వుంటాయి, కాని దాని గురించి సినిమా చివర్లో చెప్తాడు అనుకుంటాం కానీ వాటి ఊసే లేదు. ఆ ఏముంది లే.. వాల్లే తెలుసుకుంటారు, ఆ మాత్రం కూడా ఆలోచించరా అని అనుకున్నారో ఏమో మరి, సినిమా లో కులం, వర్గం అనే అంశాలను తీసుకొచ్చినప్పుడు వాటి గురించి ఏదైనా చెప్పితే బాగుండెదేమో అనిపించింది.


 


బలం బలహీనతలు 


ప్లస్ పాయింట్స్ :


* హీరో నటన.


* కొన్ని కొన్ని చోట్ల విజయ్ ఆంటోనీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.


* హీరోయిన్ పరవాలేదు.


 


మైనస్ పాయింట్స్ :


* కథనం.


* నిరుత్సాహపరిచే దర్శకత్వం.


* అర్థంకాని కామెడీ.


* సెకండాఫ్.


 


మొత్తంగా చెప్పుకోవాలంటే, 'కాశీ' సినిమా ఒక కొత్త కథకి పాత రొటీన్ కథనం. ఈ సినిమాకి పనిచేసిన వారు అంతా ఏదో సరదాగా పని చేసినట్టు ఉన్నారు కానీ ప్రేక్షకులకు ఈ సినిమా వలన ఎటువంటి సరదా లభించదు.ఈ సినిమాలో హీరో విజయ్ టాలెంట్ ఉన్న నటుడే కానీ అతని సరిగ్గా ఉపయోగించుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ముతువెల్ కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ భార్య కిరుతిగా ఉదయనిధి ఈ సినిమాకి దర్శకురాలు గా విఫలమయ్యారు. ట్రైలర్ లో చూపించిన పెద్ద పాము, ఎద్దు గురించి మొదటి 10 నిమిషాలలో తప్ప మళ్లీ వాటి గురించే ఉండదు. ఏటువంటి అంచనాలు లేకుండా వెళ్ళితే ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది.


Be the first to comment on Vijay antony's Kaasi Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
not rated
-  
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Load moreవీడియోస్!!!