ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
2.75
Verdict - నా నువ్వే
no review available

Reviewed By : Vijay MOVIE JOCKEY
2.50
Verdict - మంచి ప్రేమ కథ లో ఉండే కిక్ లేదు.

నటీనటులు : కళ్యాణ్ రామ్, తమన్నా


దర్శకత్వం : జయేంద్ర


నిర్మాత : కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి, మహేష్ కోనేరు


సంగీతం : శరత్


సినిమాటోగ్రఫర్ : పి.సి. శ్రీరామ్


ఎడిటర్ : టి.ఎస్ సురేష్


స్క్రీన్ ప్లే : జయేంద్ర


 


కళ్యాణ్ రామ్, తమన్నాలు హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నా నువ్వే’. జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి శరత్ సంగీతాన్నీ అందించారు. ఈ వారం 'నా నువ్వే' సినిమా ధియేటర్ లోకి వచ్చింది ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.


 


కథ :


ఆర్జేగా పనిచేసే మీరా (తమన్నా) డెస్టినీ మూలంగా వరుణ్ (కళ్యాణ్ రామ్) అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. వరుణ్ కూడ మీరా తన మీద పెంచుకున్న ప్రేమను చూసి కన్విన్స్ అయి ప్రేమిస్తాడు. కానీ వాళ్ళ ప్రేమకు అనుకోని కష్టం ఎదురవుతుంది. వరుణ్ మీరాకు దూరంగా వెళ్లిపోతాడు.


దాంతో మీరా ఎలాగైనా వరుణ్ ను కలుసుకోవాలని ఏకధాటిగా 36 గంటలపాటు లైవ్ రేడియో షో చేస్తుంది. అసలు వరుణ్, మీరాల ప్రేమ కథ ఏంటి, వాళ్ళ ప్రేమకు ఎవరి వలన కష్టం వచ్చింది, వరుణ్ ను కలుసుకోవడానికి మీరా చేసిన 36 గంటల ప్రయత్నం ఫలించిందా లేదా అనేదే సినిమా.


 


విశ్లేషణ : 


ఈ సినిమా దర్శకుడు పేరు జయేంద్ర, ఇతనికి అడ్వర్టైజ్మెంట్స్ డైరెక్ట్ చేయడం లో మంచి దిట్ట, ఇంతకు ముందు ఈ డైరెక్టర్ '180' అనే సినిమా తీశారు, సిద్దార్ధ హీరోగా నటించిన ఈ సినిమా లో కథ చాలా క్లిష్టంగా ఉంటుంది దానికి తోడు కథనం కూడా చాలా గజి బిజిగా ఉంటుంది, చివరికి ప్రేక్షకులకి కూడా అయోమయ పరస్థితి నెలకొంది. అయితే, నా నువ్వే సినిమా అలా కాదు, సినిమా లో కథ విషయానికి వస్తే చిన్న కథ వెంటనే అర్థమవుతుంది కాని కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది, దానికి తోడు చివర్లో మళ్లీ గజి బిజిగా ఉంటుంది. తను రాసుకునే విధానంలోనే అంత మజా ఉండదు. ఏదో చూస్తున్నాం వాళ్ళు ఏదో చేస్తున్నారంటూ సాగుతుంది.  సినిమా లో ప్రధాన పాత్ర పోషించిన కళ్యాణ్ రామ్, తమన్నా వారి వారి పాత్రలకు తగ్గట్టుగా బాగానే చేశారు కాని హీరో కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ మాత్రం సరిగ్గా లేదు. తమన్నా లాంటి హీరోయిన్ ఒక అబ్బాయి వెనుక పడుతుంది అంటే అతనిలో ఏదో విషయం ఉండాలి కానీ అలాంటివి ఏమీ కనిపించవు. ఏదో హీరో కాబట్టి వెంట పడ్తుంది అనుకోవాలి అంతే, రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా కాబట్టి సినిమాలో లవ్ మేజిక్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు, కానీ ఈ సినిమాలో అలాంటి మ్యాజిక్ లు ఏమీ లేకపోగా ప్రేక్షకులకు కొన్ని సన్నివేశాల్లో చిరాకు పుట్టిస్తుంది. 


ఈ సినిమాలో తమన్నా నటించడానికి మంచి స్కోప్ దొరికింది అవకాశం కుదిరిన మేరకు తమన్నా చాలా బాగా నటించింది, హీరో కూడా తన నటనను చూపించాడు కానీ క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటే సినిమాల్లో హీరో పాత్ర మరింత అందంగా కనిపించి ఉండేది. వెన్నెల కిశోర్, పోసాని మురళి కృష్ణ ఇలాంటి కమెడియన్స్ ఉన్నప్పటికీ సినిమాలో హాస్యం మాత్రం అంతగా పండలేదు. సినిమా నిడివి చాలా తక్కువ దానితో దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవడానికి ప్రేక్షకులకు సరైన సమయం దొరకలేదు అని అనుకోవాలి. సంగీతం బాగుంది, మూడు పాటలు చాలా బాగా వచ్చాయి. పాటలకు కొరియోగ్రఫీ కూడా బాగుంది.  సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన పి.సి. శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. ఇకపోతే మిగిలిన నటీనటులంతా వారి పాత్రకు తగ్గట్టు బాగానే చేశారు. ఖర్చు విషయంలో కొంత వెనక్కి తగ్గినట్లు అనిపించింది.


 


బలం బలహీనతలు 


ప్లస్ పాయింట్స్ :


* హీరో హీరోయిన్ నటన


* సినిమా చివర్లో వచ్చే పోసాని మురళి కృష్ణ కామెడీ


* కొత్త కథ


 


మైనస్ పాయింట్స్ : 


* కథనం సరిగ్గా లేకపోవడం


* దర్శకుడు విఫలమవడం


* హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ అంతగా పండలేదు.


 


 


మొత్తం మీద ఈ ‘నా నువ్వే’ మనం చూసిన చాలా పాత సినిమాల్లానే రొటీన్ గా సాగే కథనం, కాని కథ కొత్తగా ఉంటుంది. తమన్నా నటన, ద్వితీయార్థం చివర్లో పోసాని కృష్ణమురళి కామెడీ సీన్స్ మెప్పించే అంశాలు కాగా హీరో హీరోయిన్ల మధ్యన బాండింగ్ సరిగా లేకపోవడం ఒక మోస్తరుగా మాత్రమే ఉన్న స్క్రీన్ ప్లే నిరుత్సాహపరుస్తాయి. ప్రేమ కథల్ని ఎక్కువగా ఇష్టపడే కొన్ని మనసులకి ఈ చిత్రం ఓకే అనిపించవచ్చేమో కానీ మిగతా వారిని మెప్పించదు. 


Be the first to comment on naa nuvve Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Videos
Load moreవీడియోస్!!!
Latest News