నీది నాది ఒకే కథ | నీది నాది ఒకే కథ Review | Rating | నీది నాది ఒకే కథ News | Release Date | In Theaters | నీది నాది ఒకే కథ Pics | Photos | Images | Wallpapers | నీది నాది ఒకే కథ Direcrtor | Producer | Music | Cast | Technicians :: TollywoodTimes
విడుదల తేది : March 23, 2018, దర్శకుడు : , నిర్మాత : కృష్ణ విజయ, తారాగణం :శ్రీ విష్ణు , , నారా రోహిత్, పోసాని కృష్ణ మురళి, దేవి ప్రసాద్
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
3.50
Verdict - నిజంగా జీవితంలో నలిగిపోతున్న వాళ్ల కథా..!

నటీనటులు : శ్రీవిష్ణు, దేవి శ్రీ ప్రసాద్, సాట్నా టిటస్


దర్శకత్వం : వేణు ఊడుగుల


నిర్మాత : ప్రశాంతి, కృష్ణ విజయ్


సంగీతం : సురేష్ బొబ్బిలి


సినిమాటోగ్రఫర్ : రాజు తోట


ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి


స్క్రీన్ ప్లే : వేణు ఊడుగుల


 


నటుడిగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటూ హీరో నారా రోహిత్ సహాయంతో మరియు ప్రోత్సాహంతో చాలా సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్వతహాగానే సినిమాల్లో నటిస్తున్న హీరో శ్రీ విష్ణు. తెలుగులో శ్రీ విష్ణు చేసిన సినిమాలు తక్కువే కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకున్నాడు.  సాదాసీదాగా ఉండే తన నటన ప్రేక్షకుల్ని బాగా ఆకర్షించింది. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న శ్రీ విష్ణు ప్రస్తుతం 'నీది నాది ఒకే కథ' అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.


 


కథ :


ఒక లెక్చరర్ కొడుకైన సాగర్ (శ్రీవిష్ణు) కు చిన్నప్పటి నుండి చదువు సరిగా ఎక్కదు. బ్రతకడమంటే నచ్చిన పని చేసుకుని సంతోషంగా ఉండటమే అనుకునే సాగర్ తాను అమితంగా ప్రేమించే తండ్రిని మెప్పించాలని డిగ్రీ పాసవడానికి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తూ ఇబ్బందిపడుతూ ఉంటాడు.


ఒకానొక దశలో తనకు నచ్చింది చేయడానికి వీలుకాక, తండ్రికి నచ్చినట్టు మారలేక తీవ్ర ఒత్తిడికి, వేదనకు గురై ఇంట్లోంచి కూడా బయటికొచ్చేస్తాడు. అలా బయటికొచ్చిన సాగర్ ఏమయ్యాడు, చివరికి అతని భాధ అతని తండ్రికి అర్థమయ్యిందా లేదా అనేదే ఈ సినిమా కథ.


 


విశ్లేషణ : 


వేణు ఊడుగుల కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయమౌతున్నాడు. చాలా మంచి విషయాన్ని తీసుకున్నాడు, చాలా అందంగా ప్రేక్షకుడినీ ఆలోచింపజేసేలా తెరపై చూపించాడు. మనదేశంలో డబ్బున్న వాళ్లకు బాగా ఆస్తి పరులకు వారి పిల్లల భవిష్యత్తు గురించి పెద్దగా పట్టించుకోరు, దానికి కారణం నేను సంపాదించింది ఉంది కదా దానితో నా కొడుకు బతికేస్తాడు లే! అని అనుకుంటూ ఉంటారు, ఇక్కడ ఎటువంటి సమస్య లేదు, కానీ సమస్యంతా మిడిల్ క్లాస్ వాళ్ల దగ్గరే వచ్చింది వారి దగ్గర డబ్బులు ఉండవు కానీ మనసు నిండా కోరికలు ఉంటాయి, ఆ కోరికలను తమ పిల్లలపై రుద్దుతూ ఉంటారు. జీవితంలో వాళ్లలా ఉండాలి, వీళ్ళలా ఉండాలంటూ వారిపై ఒత్తిడి తెస్తూ ఉంటారు.  ఎందుకు వేరే వాళ్లలా మనం ఉండాలి మనకు నచ్చినట్టుగా సంతోషంగా ఆనందంగా బతికితే తప్పేంటి..? మనం జీవితంలో స్వేచ్ఛను వదిలేసి వేరే వాళ్లలా బ్రతుకుతూ ఉంటాము కారణం పరువు ప్రతిష్ఠలు ఇవి లేకపోతే బ్రతకలేము, అందుకే అందరి కంటే గొప్ప గా ఉండాలని తమ పిల్లల్ని ఒత్తిడి చేస్తూ ఉంటారు, కొంతమంది దానికి తలవంచి బ్రతికేస్తారు, కొంతమంది ఎదిరించి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు, మరికొందరు తమ జీవితాలనే త్యాగం చేస్తారు. ఎంతమందిని చూడటం లేదు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, మార్కులు సరిగా రాలేదని చనిపోతున్నవారిని... ఇలా ఎందుకు జరగాలి మనిషి మనిషిలా బ్రతికితే తప్పు ఏమిటి..? పాన్ షాపు వాడిది ఒక బ్రతుకు కాదా.. మెకానిక్ ది ఒక బ్రతుకు కాదా.. కొబ్బరిబొండాలు అమ్ముకునే వాడిది ఒక బ్రతుకు కాదా.. కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు వీళ్ళవి మాత్రమే బ్రతుకులా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను ఈ సమాజం పై వేస్తుంది ఈ సినిమా. 


 


దర్శకుడు తను చెప్పాలనుకున్నది అందంగా తనకున్న పరిధిలో చాలా బాగా చెప్పాడు. హీరో శ్రీవిష్ణు నటన ఈ సినిమాకే హైలెట్గా నిలుస్తుంది. తన లోపల ఎంతో మదనపడుతూ, ఏదో తెలియని బాధ పడుతూనే తన నిజాయతీ గల ప్రయత్నాన్ని చేస్తూ ఉండే నేటి యువత పాత్రను చాలా చక్కగా, అలవోకగా నటించేశాడు.  ప్రేక్షకులు సాగర్ అనే పాత్రలో తమను తాము చూసుకునేంత గొప్పగా నటించాడు. హీరో తండ్రిగా నటించిన దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి రెండో హీరో నేటి కాలంలోని తల్లితండ్రులు మాదిరి ఆయన నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.  హీరో కి తల్లిగా, చెల్లిగా నటించిన వారు కూడా వారి పాత్రలకు తగ్గట్టుగా బాగానే నటించారు. హీరోయిన్  పరవాలేదనిపించింది. సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రధానాకర్షణగా నిలిచింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ చాలా చక్కగా కుదిరాయి. 


 


బలం బలహీనతలు 


ప్లస్ పాయింట్స్ : 


* శ్రీ విష్ణు, దేవి శ్రీ ప్రసాద్ ల నటన


* దర్శకత్వం


* ప్రేక్షకుడి మనసుకు హత్తుకొనే సన్నివేశాలు.


* ఫస్టాఫ్, రెండోభాగంలో చివరి 30 నిమిషాలు


 


మైనస్ పాయింట్స్ :


* సెకండాఫ్లో మొదట్లో కొద్దిగా బోర్ కొడుతుంది.


* కామెడీ సన్నివేశాలు, పాటలు తక్కువగా ఉండటం.


* రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చూసే వారికి నచ్చే అంశాలు ఎమీ ఉండవు.


 


మొత్తంగా చెప్పుకోవాలంటే 'నీది నాది ఒకే కథ' సినిమాతో ప్రస్తుత సమాజంలో బ్రతుకుతున్న వారికి అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమా లో వాస్తవానికి దగ్గరగా ఉండే అంశాలే ఉంటాయి. ఈ సినిమాతో మంచి దర్శకుడు పరిచయమయ్యాడు, చిన్న చిన్న తప్పులు ఉన్నప్పటికీ కథను చెప్పడంలో ఎక్కడా తడబడకుండా 2 గంటల్లో తను అనుకున్నది సూటిగా సుత్తిలేకుండా చెప్పేశాడు. 


Reviewed By : Pavan MOVIE JOCKEY
3.25
Verdict - నీది నాదే ఒకే కథ
no review available

Reviewed By: Sudheer Reddy Anonymous
5.00
excellent movie !
సాదాసీదాగా ఉండే తన నటన ప్రేక్షకుల్ని బాగా ఆకర్షించింది. this is really fact and plus point for the movie.

 
రేటు మరియు సమీక్ష »
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
not rated
-  
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Load moreవీడియోస్!!!
Latest News