wallpaper
celebrity

నేల టికెట్
Views : 11027

2.80
|
|
Write a Review
విడుదల తేది : May 25, 2018, దర్శకుడు : కళ్యాణ్ కృష్ణ, నిర్మాత : , తారాగణం :రవి తేజ
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Pavan MOVIE JOCKEY
3.25
Verdict - నెల టికెట్

no review available


Reviewed By : Vijay MOVIE JOCKEY
2.50
Verdict - చూడాలంటే ధైర్యం వుండాలి...!

నటీనటులు : రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు


దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ


నిర్మాత : రామ్ తాళ్లూరి


సంగీతం : శక్తి కాంత్ కార్తిక్


సినిమాటోగ్రఫర్ : ముకేష్. జి


ఎడిటర్ : చోటా కె. ప్రసాద్


స్క్రీన్ ప్లే : సత్యానంద్


 


 


"సోగ్గాడే చిన్ని నాయనా", "రారండోయ్ వేడుక చూద్దాం" లాంటి వరుస హిట్స్ ఇచ్చిన కృష్ణ కళ్యాణ్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నేల టికెట్’. గ్లామర్ డాల్ మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీగా అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ 'నేల టికెట్' థియేటర్స్ లో ఏ రేంజ్ లో టికెట్స్ ని చింపుతుందో అనేది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం..


 


కథ:


చిన్నప్పటి నుండి అనాథలా పెరిగిన నేల టిక్కెట్ (రవితేజ) చుట్టూ జనం మధ్యలో మనం, జీవితంలో అందరినీ కలుపుకుని పోవాలి అనే తత్వంతో ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తుంటాడు. అలా జనానికి సహాయం చేసే ప్రక్రియలో అతనికి, హోమ్ మంత్రి ఆదిత్య భూపతి (జగపతిబాబు)కి మధ్యన తరచూ గొడవలు జరుగుతుంటాయి.


ఒకానొక సందర్భంలో నేల టిక్కెట్ తాను కావాలనే ఆదిత్య భూపతితో గొడవ పెటుకుంటున్నానని అంటాడు. అసలు నేల టిక్కెట్ హోమ్ మంత్రిని ఎందుకు టార్గెట్ చేశాడు, వారిద్దరికీ మధ్యన సంబంధం ఏమిటి, హోమ్ మంత్రి చేసిన తప్పేమిటి అనేదే తెరపై నడిచే సినిమా.


 


విశ్లేషణ :


మాస్ మహారాజ్ రవితేజ పాత్రని, ఆ పాత్రలోని పవర్ ని సినిమా ఇంట్రడక్షన్ లోనే చూపించి ఆడియన్స్ కి రవితేజను కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. దాంతో ఆడియన్స్ ఆ పాత్రకి సింక్ అవుతూ సినిమాలో లీనమవుతారు అనుకున్నారు కానీ అది పూర్తిగా ఫలించలేదు. చుట్టూ జనం మధ్యలో మనం అనే ఒక విధానంతో మొత్తం ఫస్ట్ హాఫ్ ను తీశారు. సినిమాలో ముఖ్యంగా చెప్పాల్సింది ఇంటర్వెల్ బ్లాక్ గురించి అది సినిమాపై కాస్తా ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ పర్వాలేదు అనిపించింది.


రవితేజ చాలా బాగా నటించారు, తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో చాలా చక్కగా చేశారు. సినిమా మొత్తం లో రవితేజ మాత్రమే బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచారు. సినిమాలో ఎంతమంది స్టార్స్ ఉన్నా రవితేజ మాత్రమే సినిమాలో మేజర్ హైలైట్ అవుతారు, అంతలా అతని రోల్ హైలైట్ అవుతుంది. గత సినిమాలో మిస్ అయిన రవితేజ మార్క్ కామెడీ ఈ సినిమా లోనూ కనిపించలేదు, యాక్షన్, మాస్ డైలాగ్స్ ఇందులో పరవాలేదు అనిపించారు. ఇక హీరోయిన్ మాళవిక శర్మ చక్కట్టి అభినయం చూపించారు, కాని రవితేజ పక్కన మాత్రం అంత సెట్ అవలేకపోయారు.


"సోగ్గాడే చిన్ని నాయనా", "రారండోయ్ వేడుక చూద్దాం" లాంటి వరుస హిట్స్ ఇచ్చిన కృష్ణ కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అంటే నమ్మలేము అలా వుంది సినిమా, మరీ పాత స్టోరీ లైన్ దానికి తోడు కథ ముందుగానే అర్థమయ్యేలా నడిచే కథనం. సెకండాఫ్ మొదలైన 10 నిమిషాలకే సినిమా మరీ రొటీన్ గా మారిపోయి, సాగదీస్తున్న ఫీలింగ్ ని తీసుకు రావడమే కాకుండా ఊహాజనితంగా సాగుతుంది. అది సినిమాకి మరో బిగ్గెస్ట్ మైనస్. మ్యూజిక్ పరవాలేదు అనిపించింది, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే వుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాలేదు. కనీసం ఇప్పటినుంచి అయినా రవితేజ తను స్టోరీలను ఆచి తూచి సెలెక్ట్ చేసుకోవాలి.


 


బలం బలహీనతలు :


ప్లస్ పాయింట్స్ :


* రవితేజ పెర్ఫార్మెన్స్ 


* ఇంటర్వల్ బ్లాక్


* మ్యూజిక్ 


 


మైనస్ పాయింట్స్ :


* డైరెక్షన్ ఫెయిల్యూర్.


* పాత కథ.


* ఊహాజనిత కథనం.


* కామెడీ లేకపోవడం.


 


 


చివరిగా చెప్పుకోవాలంటే కమర్షియల్ సినిమాలు కోరుకునే మూవీ లవర్స్, రవితేజ ఫ్యాన్స్ కి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమా తో కృష్ణ కళ్యాణ్ చాలానే నిరాశ పరిచారు. పాత కథ, ఊహించే కథనం ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తుంది. లవ్ ట్రాక్ అంతగా పండలేదు, కామెడీ లేకపోవడం, మంచి స్టోరీ లైన్ లేకపోవడం సినిమా పై ఆసక్తి లేకుండా చేస్తుంది. రవితేజ కాతాలో 'నేల టికెట్' సినిమాతో మరో పరాజయం వచ్చింది.


Reviewed By: Nasser Anonymous
4.50
Kk so nice
But some changes titles

 
రేటు మరియు సమీక్ష »
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
not rated
-  
 • 0.5
 • 1.0
 • 1.5
 • 2.0
 • 2.5
 • 3.0
 • 3.5
 • 4.0
 • 4.5
 • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
రవితేజ నేల టికెట్ పోస్టర్
Videos
Load moreవీడియోస్!!!
Latest News