language
Home >> News
Dedicated Servers from Liquid Web

సైరాట్ టీం నుంచి వస్తున్న ‘నాల్’.. టీజర్ ఇలా...

By : Pavan |
  Oct 11, 2018, 18:59 IST
| Views : 29

రెండేళ్ళ క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా ‘సైరాట్’. మరాఠీలో వచ్చిన ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదు. దర్శకుడు నాగరాజు పొపట్రావ్ మంజూలేకు ఈ సినిమా అంతులేని విజయాన్ని ఇచ్చింది. కాగా ఇంతపెద్ద హిట్ సినిమా చేసిన ఈ టీమ్ నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది. ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ వారినుంచి వస్తున్న మరో సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ ఇవాళ విడుదల చేశారు. ‘నాల్’ పేరుతో విడుదలైన ఈ టీజర్‌పై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

మరి ఈ సినిమాకు దర్శకుడు నాగరాజు మాత్రం కాదు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్నారు. ఇన్ని రోజులు దర్శకుడిగా ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించిన నాగరాజు నటుడిగా, నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. దర్శకుడు ఎవరంటే.. సైరాట్ సినిమాకు సినీమటోగ్రఫీ అందించిన సుధాకర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  ఓ 8ఏళ్ళ బాలుడి భావోద్వేగాలతో నిర్మితమైన ఈ సినిమా నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సైరాట్ తర్వాత వస్తున్న ఈ ‘నాల్’ సినిమాపై దేశవ్యాప్తంగా చాలా అంచనాలు వున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మరొక విశేషం ఏంటంటే దర్శకుడు సుధాకర్ రెడ్డి తెలుగువాడు అవడం. 

ఈ మరాఠీ సినిమాకు తెలుగువాడు దర్శకుడు అవడం గర్వకారణం. ఈయన ప్రస్తుతం తెలుగులో వస్తున్న హిస్టారికల్ సినిమా ‘జార్జిరెడ్డి’కి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ‘చిన్న సినిమా పెద్ద విజయం’ అనే మాటకు నిదర్శనంగా మారారు సైరాట్ టీమ్. వారి నుంచి వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. నవంబర్‌లో వస్తున్న ఈ సినిమా కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related News
No News Found
Related Photos
No Photos Found
Related Videos
No Videos Found
 
Recommended
Recommended
Latest Albums