language
Home >> News
Dedicated Servers from Liquid Web

జయహో నేనే రాజు నేనే మంత్రి

  Aug 12, 2017, 14:49 IST
| Views : 71

తేజ దర్శకత్వం లో రానా హీరో గా నటించిన చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. ఆగష్టు 11 న విడుదలైన ఈ సినిమా ఒక రకంగా బాగానే పేలిందనే చెప్పాలి. సినిమా పరంగా చుస్తే ఓకే అనిపించినా ఒక పంచ్ డైలాగ్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రాజకీయ నాయకుడు పాత్రను పోషిస్తున్న అశుతోష్ రానా చెప్పిన పంచ్ డైలాగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దర్శకుడు తేజ ఈ సినిమాలో ఈ ఒక్క డైలాగ్ తో మన పూర్తి  రాజకీయ వ్యవస్థను చూపించేసాడని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఏది ఎలా ఉన్న తేజ మాత్రం ఈ సినిమాతో మంచి మెసేజ్ మాత్రం ఇచ్చాడు.

హీరో రానా  'లీడర్' తర్వాత రాజకీయ నేపథ్యం లో చేసిన సినిమా కావడం తో  ఈ సినిమా పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు దర్శక-నిర్మాతలు. వారి ఆశను నెరవేరుస్తూ ఈ సినిమా విజయాపథం లో దూసుకెళ్తుంది. ఏది ఎలా ఉన్న ఈ సినిమా ఇటు మాస్ ప్రేక్షకులతో పాటు అటు క్లాస్ ప్రేక్షకుల చేత ఈలలు మాత్రం కాస్త గట్టిగానే వేయిస్తుంది.

Related News
Aug 21, 2017, 15:36 IST
Aug 14, 2017, 21:25 IST
Aug 07, 2017, 17:05 IST
Jun 23, 2017, 15:26 IST
Jun 16, 2017, 10:44 IST
May 30, 2017, 10:52 IST
Related Photos
Aug 15, 2017, 14:13 IST
Aug 10, 2017, 12:42 IST
Aug 10, 2017, 10:52 IST
Related Videos
Jun 19, 2017, 12:58 IST
Feb 01, 2017, 11:23 IST
Jul 30, 2015, 12:33 IST
 
Recommended
Recommended
Latest Albums