language
Home >> News
Dedicated Servers from Liquid Web

హైదరాబాద్ లో అల్లు అర్జున్ నా పేరు సూర్య భారీ క్లైమాక్స్ షూటింగ్

By : Vijay |
  Feb 14, 2018, 19:48 IST
| Views : 253

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. సోమవారం నుంచి (12-02) హైదరాబాద్ లో భారీ షూటింగ్ కు ప్లాన్ చేశారు. ఇందులో చిత్ర క్లైమాక్స్ షూటింగ్ చేయనున్నారు.  ఈ చిత్రంలోని రెండో పాట లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో అనే పాటను ప్రేమికుల దినోత్సవ కానుకగా... ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ మధ్యే రిలీజ్ చేసిన సైనిక పాటతో తనలోని దేశభక్తిని చాటుకున్న అల్లు అర్జున్... ఇప్పుడు లవర్ ఆల్సో అంటూ ప్రేమను పంచబోతున్నారు. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్య మందించారు. విశాల్ శేఖర్ సంగీతమందించారు. శేఖర్ ఈ పాటను పాడారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా... వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ... గ్రాండియర్ గా “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. చిత్రాన్ని నిర్మిస్తున్నాం. రేపటి నుంచి హైదరాబాద్ లో క్లైమాక్స్ చిత్రీకరించబోతున్నాం. ఈ క్లైమాక్స్ ను భారీస్థాయిలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాం. లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అనే పాటను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం. రామజోగయ్య శాస్త్రి తన అనుభవాన్ని రంగరించి ఈ అందమైన పాటను రచించారు. విశాల్ శేఖర్ అద్భుతమైన ట్యూన్ అందించారు. శేఖర్ గాత్రంతో ఈ పాట మరింత అందంగా తయారైంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

నటీనటులుస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్  యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు


సాంకేతిక నిపుణులు

ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)ఫైట్స్ - రామ్ లక్ష్మణ్సాహిత్యం - రామజోగయ్య శాస్త్రిప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్సినిమాటోగ్రఫి - రాజీవ్ రవిసంగీతం - విశాల్ - శేఖర్ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబుబ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్సమర్పణ - k.నాగబాబు  సహ నిర్మాత - బన్నీ వాసునిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటిరచన, దర్శకత్వం - వక్కంతం వంశీ


Related News
Nov 10, 2018, 17:11 IST
Aug 10, 2018, 23:08 IST
Jul 28, 2018, 07:20 IST
Jul 17, 2018, 21:10 IST
Jul 01, 2018, 14:31 IST
May 12, 2018, 21:59 IST
Related Photos
Oct 02, 2017, 19:45 IST
Sep 30, 2017, 13:29 IST
Sep 26, 2017, 11:19 IST
Related Videos
May 15, 2018, 00:38 IST
Feb 14, 2018, 14:47 IST
Jan 26, 2018, 23:39 IST
 
Recommended
Recommended
Latest Albums