language
Home >> News
Dedicated Servers from Liquid Web

అరవింద సమేత ఒక కొత్త కోణాన్ని చూపించనుంది - త్రివిక్రమ్ శ్రీనివాస్

By : Pavan |
  Oct 09, 2018, 16:25 IST
| Views : 55

‘అజ్ఞాతవాసి’ చిత్రం తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈచిత్రం ఈనెల 11న విడుదలవుతున్న సందర్భంగా త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఎఫ్‌.బి.తో  ముఖాముఖి...


ఆడియో ఫంక్ష‌న్ లో మీరు ఎక్కువ‌గా  మాట్లాడ‌లేదు?


ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో చాలా అయోమయంలో వున్నాను. హరికృష్ణ గారి మరణం అందరి మనసుల్లో ఉండిపోయింది. నేను ఏం మాట్లాడిన దాంతోనే ముగించాలి. అందుకనే ఎక్కువగా మాట్లాడకుండా ఎన్టీఆర్ కు వదిలేశా.


హరి కృష్ణ గారి మరణం తర్వాత, ఈ సినిమా వాయిదా వేదం అనుకున్నారా ?


హరికృష్ణ గారు చనిపోయిన అనంత‌రం నేను, చినబాబు గారు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేద్దామనుకున్నాం. ఎందుకంటె డిసెంబర్ , జనవరి లో చాలా సినిమాలు విడుదల డేట్ ను ప్రకటించుకున్నాయి. కాని రెండు రోజుల తరువాత తారక్ ఫోన్ చేసి నేను షూటింగ్ కు వస్తాను. సినిమా అనుకున్న సమయానికి విడుదల కావాలఅన్నాడు. ఆయన మాటలు విని షాక్ అయ్యాం. ఆయన ఏం చెప్పాడో అలాగే చేశాడు.


ఫ్యాక్ష‌న్‌ సినిమాలు చాలా వచ్చాయి కదా. ఈ సినిమా లో కొత్తదనం ఏముంటుంది ?


ఇంతకు ముందు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అరవింద సమేత ఒక కొత్త కోణాన్ని చూపించనుంది. అక్కడి మహిళలు ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు. వాళ్ళు పడిన బాధలు ఎలా వుంటాయో ఈచిత్రంలో చూపించాను.


పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్న కోబలి కథ ఇదేనా ?


చాలా మంది ఇదే ప్రశ్న అడిగారు. పవన్ కళ్యాణ్ తో తీద్దామనుకున్న కోబలి చిత్రానికి, ఈసినిమాకి సంబంధం లేదు. అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో పాటు ఎమోషన్స్ తో సాలిడ్ గా ఉంటుంది ఈచిత్రం.


కామెడీ ఉంటుందా ?


నేను మొదటి సారి ఈచిత్రంలో నేను స్టోరీ కి ఏం కావాలో అది మాత్రమే తీశాను . అనవసరమైన కామెడీ, శృతి మించిన రొమాన్స్ లాంటివి ఈచిత్రంలో వుండవు. ఎమోషన్స్ ఈచిత్రానికి హైలైట్ అవుతాయి.


జగపతి బాబు పాత్ర గురించి చాపండి ?

జగపతి గారు ఈ చిత్రంలో అహం పూరితమైన ప్రజలు ఎంత దూరమైన వెళ్ళి ప్రతీకారం తీర్చుకుంటారు అనేదే ఆయన పాత్ర బయటపెడుతుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసాక ఆయన పాత్రని ద్వేషిస్తారు.


అజ్ఞాతవాసి వైఫల్యాన్ని ఎలా తీసుకున్నారు ?


నేను హిట్లు, ప్లాపులను పట్టించుకోకుండా సినిమాలు తీస్తుంటాను. నేనుఎల్లప్పుడు స్క్రిప్ట్ చదవడం , రాయడం లోనే బిజీ గా వుంటాను. ఆ మూమెంట్ లో ఏదైనా ఎక్సయిటెడ్ ఐడియా వస్తే దాన్ని మీదనే పని చేస్తాను మిగితావి పక్కకు పెట్టేస్తాను.


సునీల్ తిరిగి రివ‌డానికి కార‌ణం ఏంటి?


సునీల్ యాక్టువ‌ల్‌గా  నా చుట్టూ ఒక ఛ‌ట్రం భిగించుకున్నాను ఎలా బ‌య‌ట‌కు రావాలో తెలియ‌డంలేదు అన్నాడు. ఏం ప‌ర్వాలేదు ముందు మీరు మీ చేతిలో ఉన్న మూవీస్‌ని కంప్లీట్ చెయ్యి త‌ర్వాత అవ‌కాశాలు అవే వ‌స్తాయి అన్నాను. సిల్లీ ఫెలోస్ మాకంటే ముందే మొద‌లైంది.


ఈ మ‌ధ్య కాలంలో మీకు నచ్చిన  సినిమాలు?

ఆర్.ఎక్స్‌.100, అర్జున్‌రెడ్డి, రంగ‌స్థ‌లం, కేరాఫ్ కంచెర‌పాలెం, గూఢ‌చారి ఇలా కొన్ని సినిమాలు న‌చ్చాయి. గూఢ‌చారి రియ‌ల్లీ బావుంట‌ది అంత త‌క్కువ బ‌డ్జెట్ తో చెయ్య‌డం అనేది చాలా క‌ష్టం.

Related News
Oct 08, 2018, 22:47 IST
Sep 07, 2018, 09:39 IST
Aug 22, 2018, 22:29 IST
Aug 15, 2018, 12:52 IST
Aug 04, 2018, 09:26 IST
Aug 03, 2018, 17:42 IST
Related Photos
May 12, 2018, 11:51 IST
Nov 29, 2017, 18:49 IST
Nov 27, 2017, 15:12 IST
Related Videos
Oct 02, 2018, 20:56 IST
Oct 02, 2018, 18:01 IST
Sep 29, 2018, 18:13 IST
 
Recommended
Recommended
Latest Albums