language
Home >> News
Dedicated Servers from Liquid Web

శ్రీవల్లి వంటి చిత్రాలు తెలుగులో వస్తున్నందుకు ఎంతో సంతోషంగా వుంది: ఎంపీ కవిత

  Sep 13, 2017, 15:24 IST
| Views : 276

ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం శ్రీవల్లి. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 15న విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రముఖుల నుండి అభినందనలు అందుతున్నాయి. 

సెలబ్రిటీ లతో పాటు రాజకీయ నాయకుల విశేష్ తో ఈ చిత్రం పబ్లిసిటీ పరంగా ముందంజలో వుంది. తాజాగా ఎంపీ, తెలంగాణ మహిళా నేత కవిత..ఈ చిత్రానికి బెస్ట్ విశేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..శ్రీవల్లి సినిమా లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కిన చిత్రం. లేడీ ఓరియెంటెడ్ అనగానే సెంటిమెంట్, ఏడుపులు, తుడుపులు వంటివి కాకుండా, ఒక అమ్మాయి సైన్టిస్ట్ గా, ఆమె చేసే ప్రయోగాలు..తద్వారా జరిగే పరిణామాలన్నింటిని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. 

అలాగే ఒక మహిళా ఈ చిత్రాన్ని నిర్మించిందంటే, తప్పనిసరిగా ఈ చిత్రానికి ఘన విజయాన్ని అందించాల్సిన అవసరం మనందరికీ ఉందని నేను భావిస్తున్నాను. ఇటువంటి కొత్త కాన్సెప్ట్స్ తెలుగులో వస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. అందుకే అందరూ శ్రీవల్లి సినిమాని చూసి, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..అన్నారు. రాజీవ్‌కనకాల, సత్యకృష్ణ, హేమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్ శ్రీలేఖ, కెమెరా: రాజశేఖర్.


Related News
Apr 15, 2018, 19:00 IST
Sep 21, 2017, 11:02 IST
Sep 17, 2017, 11:50 IST
Sep 17, 2017, 11:57 IST
Sep 11, 2017, 16:52 IST
Sep 05, 2017, 09:33 IST
Related Photos
Sep 21, 2017, 11:22 IST
Sep 13, 2017, 15:35 IST
Sep 12, 2017, 12:15 IST
Related Videos
Jan 24, 2017, 11:41 IST
Jan 24, 2017, 11:16 IST
 
Recommended
Recommended
Latest Albums