language
Home >> News
Dedicated Servers from Liquid Web

రంగస్థలం మూవీ లో ఎంత సక్కగున్నావే సాంగ్ - అచ్చ తెలుగుదనానికి కొత్త అడ్రస్.

By : Vijay |
  Feb 14, 2018, 20:18 IST
| Views : 129

రంగస్థలం మూవీ లో తొలి పాట 'ఎంత సక్కగున్నావే' పాట ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమికులకి కానుకగా విడుదల చేశారు. ఆ పాట వింటుంటే అనిపించింది తెలుగుదనానికి, అచ్చ తెలుగుదనానికి, పల్లెదనానికి కొత్త శోభను సంతరించుకోనుంది అని తెలుస్తోంది. అంత చక్కగా ఉంది ఆ పాట. అసలు ఈ మధ్యకాలంలోనే అంత తెలుగుదనం ఉట్టిపడే పాట అసలు రాలేదనే చెప్పాలి. అంత గొప్పగా ఉంది ఈ పాట. నిజంగా సుకుమార్ ని,  రామ్ చరణ్ తేజను అభినందించాలి. తెలుగుదనానికి కొత్త చిగురు ను అందించారు. దేవీశ్రీప్రసాద్ ట్యూన్స్, చంద్రబోస్ సాహిత్యం తో ఒక అద్భుతమైన తెలుగుదనం ఉట్టిపడే పాట సృష్టించారనే చెప్పాలి.

ఒక స్టార్ డమ్,  ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఏమి చేసినా దాన్ని అనుసరించే ఫ్యాన్స్ కోకొల్లలు. ఇప్పటివరకు సినిమాల ద్వారా వెస్ట్రన్ కల్చర్,  మనకు సంబంధం లేని చాలా కల్చర్స్ ని మనం అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు మనదైన మన కల్చర్ ని అలవాటు చేసుకునే అవకాశం వచ్చింది. అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు మన రామ్ చరణ్ తేజ్. సుకుమార్ తో కలసి రామ్ చరణ్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించి తీరాలి,  ఇలాంటి ప్రయత్నాలు మిగతా హీరోలు కూడా చేసేలా ప్రోత్సహించాలి.  అప్పుడే తెలుగు కల్చర్ కి కొత్త వైభవం వస్తుంది. సినిమా అంటే వ్యాపారం మాత్రమే కాదు. సమాజంలో ఒక భాగం. బాధ్యత ఉంటుంది. ‌ మన తెలుగు సంప్రదాయాలను,  సంస్కృతులను  కాపాడాల్సిన బాధ్యత మన సినిమాల మీద తప్పకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చూసుకుంటే రంగస్థలం మూవీ తో రామ్ చరణ్ చేసిన ఈ కొత్త ప్రయత్నం నిజంగా అమూల్యమైనది.

రామలక్ష్మి పాత్రను పరిచయం చేస్తూ టీజర్ను విడుదల చేశారు. ఆ పాత్ర చాలా అద్భుతంగా ఉంది. అప్పుడెప్పుడో 'దసరా బుల్లోడు' సినిమాలో పల్లెపడుచు గా నటించిన వాణిశ్రీ  అందాలను అప్పటి ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేరు అంత అందంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారామె. మరి ఇన్నాళ్లకి రామలక్ష్మి పాత్ర లో సమంతాను స్వచ్చమైన పల్లెపడుచు సహజ అందాలతో చూపెట్టారు. పల్లెపడుచు అంటే నండూరి వారి ఎంకి. ఇప్పటి ప్రేక్షకులకు నండూరి వారి ఎంకి అంటే తెలియకపోవచ్చు.  1950 కి ముందు నండూరి సుబ్బారావుగారు అనే ఒకాయన నాయుడు బావ, ఎంకి పాత్రలను సృష్టించి జానపద పాటలు రాశారు. ఆ పాటలు నిండా గ్రామీణ వాతావరణమే ఉంటుంది. ఎవరికైనా గ్రామీణ పల్లెపడుచు అంటే నండూరి వారి ఎంకి జ్ఞాపకం వస్తుంది. అలానే ఈ సినిమాలో సుకుమార్ నండూరి వారి ఎంకి ని దృష్టిలో పెట్టుకునే సమంత పాత్రను సృష్టించారు అని అర్థమవుతోంది.

లంగా ఓణీతో కట్టెలమోపు నెత్తిపై పెట్టుకుని వయ్యారంగా సమంత నడిచి వెళుతుంటే నండూరి వారి ఎంకిని తలపించినట్టు ఉంది. అంత అద్భుతంగా ఆ పాత్రను డిజైన్ చేశారు. ఈ తరంవారికి నండూరి ఎంకి అంటే సమంతానే అనేంత చక్కగా నటించింది. ఈ విషయం పోస్టర్లను, టీజర్ను చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇక సినిమా విడుదల అయిన తర్వాత ఒక అద్భుతాన్నే చూడొచ్చు సమంత పాత్రలో.

Related News
No News Found
Related Photos
No Photos Found
Related Videos
No Videos Found
 
Recommended
Recommended
Latest Albums