language
Home >> News
Dedicated Servers from Liquid Web

'తాప్సి' కథానాయికగా 'గేమ్ ఓవర్' ప్రారంభం

By : Pavan |
  Oct 11, 2018, 20:29 IST
| Views : 62

ప్రముఖ కథానాయిక 'తాప్సి' ప్రధాన పాత్రలో 'గేమ్ ఓవర్' పేరుతో  ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ 'వై నాట్ స్థూడియోస్' ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.

గతంలో ఈ సంస్థ సిద్ధార్ధ్' కథానాయకునిగా రూపొందిన 'లవ్ ఫెయిల్యూర్' (2012), విక్టరీ 'వెంకటేష్' కథానాయకునిగా రూపొందిన 'గురు' (2017) వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు తమ మరో ప్రయత్నం గా తాప్సి' ప్రధాన పాత్రలో  ఈ 'గేమ్ ఓవర్' ను నిర్మించటాన్ని సంతోషంగా ప్రకటించింది. 'నయనతార' కథానాయికగా తమిళ నాట ఘనవిజయం సాధించిన 'మయూరి' వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు 'అశ్విన్ శరవణన్' దర్శకత్వంలో ఈ 'గేమ్ ఓవర్'  చిత్రాన్ని అభిరుచి కలిగిన నిర్మాత వై నాట్ స్థూడియోస్' అధినేత ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. 

ఈ 'గేమ్ ఓవర్' చిత్రం చెన్నై లో నేడు (అక్టోబర్ పదకొండు) ప్రారంభమయింది. ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో ఏక కాలంలో నేటి నుంచి ఏక ధాటిగా ఆంద్ర,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది అని నిర్మాత ఎస్.శశికాంత్ తెలిపారు. 'లవ్ ఫెయిల్యూర్', 'గురు', విజయాల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

ఈ 'గేమ్ ఓవర్' చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ , ఎడిటర్: రిచర్డ్ కెవిన్, రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్, మాటలు: వెంకట్ కాచర్ల, ఛాయా గ్రహణం: ఎ.వసంత్, ఆర్ట్: శివకుమార్, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.కె.నందిని, పోరాటాలు: 'రియల్' సతీష్, సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా), స్టిల్స్: ఎమ్.ఎస్.ఆనందం, పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న, పి.ఆర్.ఓ. లక్ష్మి వేణుగోపాల్, వై నాట్ స్టూడియోస్ టీమ్: కంటెంట్ హెడ్: సుమన్ కుమార్, డిస్ట్రిబ్యూషన్ హెడ్:  కిషోర్ తాళ్లూరు, బిజినెస్ ఆపరేషన్స్: ప్రణవ్ రాజ్ కుమార్. 

Related News
Aug 22, 2018, 22:26 IST
Jul 16, 2018, 16:46 IST
Aug 21, 2017, 14:29 IST
Aug 17, 2017, 14:15 IST
Jun 28, 2017, 12:32 IST
Mar 31, 2017, 15:43 IST
Related Photos
Aug 21, 2017, 10:52 IST
Aug 16, 2017, 10:56 IST
Aug 06, 2017, 17:32 IST
Related Videos
Jul 20, 2017, 11:09 IST
Feb 05, 2017, 12:55 IST
Jan 17, 2017, 17:35 IST
 
Recommended
Recommended
Latest Albums