language
Home >> News
Dedicated Servers from Liquid Web

పవన్ నెక్స్ట్ సినిమా ఇదే!

By : Vijay |
  Jan 13, 2018, 01:56 IST
| Views : 984

తాజా గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా 'అజ్ఞాతవాసి' విడుదలై బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది కొన్నిచోట్ల ఫరవాలేదు అని స్పందన లభించినా చాలాచోట్ల డివైడ్ టాక్ వినిపిస్తోందీ. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఇక సినిమాల్లో నటించరని ఇదే ఆఖరి సినిమా అని ఇక పూర్తిగా రాజకీయాల్లో ఉండి జనసేన పార్టీని పూర్తిగా జనంలోకి తీసుకెళ్తారని కూడా వార్తలు వచ్చాయి.


కానీ తాజా సమాచారం ప్రకారం గా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా 'అజ్ఞాతవాసి' విడుదలై ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయిందని అందుకే పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రేక్షకులకు ఒక విజయవంతమైన సినిమా అందించిన తర్వాత పూర్తి రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.


పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' విడుదల తర్వాత సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అవి ఏమిటి అంటే... పవన్ సినిమాల్లో నటిస్తారా?... ఒకవేళ నటిస్తే ఏ సినిమాలో నటిస్తారు?  సినిమా పేరు ఏంటి? ఎవరి దర్శకత్వంలో చేస్తున్నారు?  అనే విషయాలు అటు ఫిల్మ్ నగర్ లోనూ ఇటు సోషల్ మీడియా లోనూ చర్చ జరుగుతోంది.


పవన్ తన తదుపరి చిత్రాన్ని సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో  ఓ తమిళ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారనీ అదికూడా మైత్రి మూవీస్ బ్యానర్ లోనే చేయబోతున్నారని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే... అయితే తాజా సమాచారం ప్రకారం ఏఎం రత్నం నిర్మాణంలో ఓ సినిమా మొదలు కాబోతోందని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ 'చరిత్ర' అని ఒక పవర్ ఫుల్ టైటిల్ ను  ఫిక్స్ చేసారని తెలుస్తోంది.


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే చిత్రం 'చరిత్ర' అనీ  'నిశ్శబ్దం వీడి ఆయుధం' అనే ఉప శీర్షిక తో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా ఎ.ఎం.రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.  గతంలో పవన్ కళ్యాణ్ ఏఎం రత్నం కాంబినేషన్లో 'సత్యాగ్రహి' అనే సినిమా చేయాల్సి ఉంది.  కానీ కొన్ని కారణాల రీత్యా ఆ సినిమా పట్టాలెక్కలేదు.


అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రం తెరపైకి వచ్చింది. ఈ సినిమా కి 'మాయా మహాల్' చిత్రానికి దర్శకత్వం వహించిన  గోవింద లాలం దర్శకత్వం వహించబోతున్నారట. ఈ చిత్రానికి మాటలు ఆకుల శివ రాయబోతున్నారు. ఇక సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన ముహూర్తపు కార్యక్రమాలు కూడా ఏఎం రత్నం ఆఫీసులో చాలా నిరాడంబరంగా జరిగాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు సాంకేతిక నిపుణుల సమాచారాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.


అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ  ఈ వార్త టాలీవుడ్ లోనూ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడనీ  సామాన్యుల కోసం పోరాడే నాయకుడిగా ఈ సినిమాలో కనిపిస్తాడని సమాచారం. మొత్తంగా ఈ వార్త టాలీవుడ్ లోనూ, సోషల్ మీడియాలోనూ  బ్రేకింగ్ న్యూస్ గా మారింది.

Related News
Feb 12, 2018, 17:01 IST
Feb 10, 2018, 14:54 IST
Feb 08, 2018, 11:11 IST
Feb 06, 2018, 00:06 IST
Jan 28, 2018, 23:46 IST
Jan 27, 2018, 23:20 IST
Related Photos
Nov 27, 2017, 15:12 IST
Nov 27, 2017, 15:09 IST
Nov 27, 2017, 15:08 IST
Related Videos
Jan 15, 2018, 21:59 IST
Jan 07, 2018, 08:01 IST
Dec 31, 2017, 20:46 IST
 
Recommended
Recommended
Latest Albums