language
Home >> News
Dedicated Servers from Liquid Web

అజ్ఞాతవాసి కి మిశ్రమ స్పందన... ఇతర భారీ సినిమాలకు లాభించే అవకాశాలు!

By : Vijay |
  Jan 11, 2018, 23:08 IST
| Views : 285

ఎన్నో భారీ అంచనాలతో విడుదల అయిన 'అజ్ఞాతవాసి' ప్రేక్షకుల అంచనాలను అధిగమించలేకపోయింది. అత్యంత భారీ బడ్జెట్ తో విడుదలయిన ఈ సినిమా అభిమానులను సైతం నిరాశలో ముంచేసింది. అసలు ఇది త్రివిక్రమ్ రచయితగా పనిచేసిన సినిమాయేనా ఇది?  అని ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాత్ర తీర్చి దిద్దడంలో నే త్రివిక్రమ్ తప్పులు చేసుకుంటూ పోయాడని అందరూ విమర్శిస్తున్నారు.


ఈ విమర్శల సంగతి పక్కన పెడితే 'అజ్ఞాతవాసి' కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. యూఎస్ లో అయితే ప్రీమియర్ షో వసూళ్లలో 'బాహుబలి 2'  తర్వాత 'అజ్ఞాతవాసి'నే నిలబడుతుంది. కానీ ఈ సినిమాకు వచ్చే నెగిటివ్ టాక్ వలన ఎంతవరకు ఈ సినిమా వసూళ్లను రాబడుతుంది అనేది వేచి చూడాల్సిందే.


ఇక అసలు విషయంలోకి వస్తే 'అజ్ఞాతవాసి' కి మిశ్రమ స్పందన, నేగిటివ్ టాక్ వలన మిగతా సినిమాలకి ప్లస్ పాయింట్ అయింది.  ఈ సంక్రాంతికి ప్రధానంగా నాలుగు సినిమాలు పోటీ పడడానికి సిద్ధపడ్డాయి.  సంక్రాంతి బరిలోకి మొట్టమొదటి సినిమా వచ్చేసింది. అదీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇంకా మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విడుదలకు సిద్ధంగా వున్న సినిమాలు ప్రధానంగా జై సింహా, గ్యాంగ్, రంగులరాట్నం సినిమాల పైనే అందరి చూపు ఉంది. ఈ మూడు సినిమాల్లో ఏది విజయం వైపు దూసుకు పోతుంది అని అందరూ ఎదురుచూస్తున్నారు.


బాలకృష్ణ సినిమాకి అభిమానుల హడావిడి ఉండనే ఉంటుంది కాబట్టి 'జైసింహ' ఓపెనింగ్స్ కి డోకా లేదు. అయితే విజయవకాశాలు ఎంత వరకు ఉంటాయి అనేది ఆ సినిమా మీద ఆధారపడి ఉంటుంది. రేపు జై సింహా విడుదల అవుతుంది.  బాలకృష్ణ అభిమానులకు రేపు పండగే.  ఇక 'రంగుల రాట్నం' సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ 'గ్యాంగ్' సినిమాకి ఎటువంటి అంచనాలు కనిపించడం లేదు. కానీ 'అజ్ఞాతవాసి' సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కారణంగా సూర్య నటించిన 'గ్యాంగ్' సినిమా మీద కూడా ప్రేక్షకులు కన్ను పడింది. సహజంగానే సూర్య సినిమాకి క్రేజ్ ఉంటుంది. కానీ సంక్రాంతి బరిలో అతను నిలబడగలడా?.... అని అంతా అనుమానించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 'గ్యాంగ్' సినిమాకి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూడు సినిమాల లో ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.

Related News
May 21, 2018, 23:21 IST
May 17, 2018, 19:49 IST
May 15, 2018, 13:26 IST
May 14, 2018, 23:51 IST
May 14, 2018, 22:07 IST
May 14, 2018, 22:07 IST
Related Photos
May 17, 2018, 01:05 IST
Nov 27, 2017, 15:12 IST
Nov 27, 2017, 15:09 IST
Related Videos
Mar 05, 2018, 18:03 IST
Jan 15, 2018, 22:39 IST
Jan 15, 2018, 21:59 IST
 
Recommended
Recommended
Latest Albums